ఇటీవల కాలంలో ప్రపంచ క్రికెట్లో స్టార్ ప్లేయర్లుగా ఉన్న వారందరూ కూడా తమ అత్యుత్తమమైన ప్రదర్శన చేస్తూ వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతున్నారు అని చెప్పాలి. ముఖ్యంగా టెస్ట్ ఫార్మాట్లో బ్యాటింగ్ తో  విజృంభిస్తున్న ఆటగాళ్లు ఇటీవల కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఛాన్స్ వచ్చిందంటే చాలు ఇక తమ బ్యాటింగ్ సత్తా ఏంటో చూపించి సెంచరీలతో వరుసగా ఆటగాళ్లు  చెలరేగి పోతు ఉండడం మాత్రం అటు క్రికెట్ ప్రేక్షకులందరికీ ఎంటర్టైన్మెంట్ పంచుతూ ఉంది అని చెప్పాలి. ముఖ్యంగా గత కొంతకాలం నుంచి అయితే టెస్ట్ ఫార్మాట్ లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు బ్యాటింగ్ విధ్వంసాన్ని కొనసాగిస్తున్నారని చెప్పాలి.


 ప్రత్యర్థి ఎవరైనా సరే ఇక ప్రతి మ్యాచ్ లో కూడా ఆస్ట్రేలియా జట్టులో ఉన్న ఎవరో ఒక ఆటగాళ్లు సెంచరీ తో చెలరేగిపోతూ ఉండడం ఇక వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉండటం చేస్తూ ఉన్నారు. అయితే గత కొంతకాలం నుంచి టెస్ట్ ఫార్మాట్లో అత్యుత్తమమైన ఫామ్ లో కొనసాగుతూ అదిరిపోయే ప్రదర్శన చేస్తున్న స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ సైతం మరో సెంచరీ తో చెలరేగిపోయాడు. సౌత్ ఆఫ్రికా తో జరుగుతున్న మూడో టెస్టులో భాగంగా ఏకంగా 14 పరుగులు చేసి చెలరేగిపోయాడు అని చెప్పాలి.


 అదే సమయంలో ఏకంగా స్మిత్ సాధించిన సెంచరీ కాస్త అతనికి 30 వ సెంచరీ కావడం గమనార్హం. ఇక ఈ క్రమంలోనే  క్రికెట్ లో లెజెండరీ క్రికెటర్ గా కొనసాగుతున్న బ్రాడ్మన్ రికార్డును స్టీవ్ స్మిత్  బ్రేక్ చేశాడు అని చెప్పాలి. బ్రాడ్ మన్ తన కెరీర్ లో 29 సెంచరీలు చేయగా.. ఇక ఇప్పుడు 30 సెంచరీలతో స్మిత్ దానిని అధిగమించాడు. అయితే అత్యధిక సెంచరీలు చేసిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు రికీ పాంటింగ్ 41 టెస్ట్ సెంచరీలతో టాప్ ప్లేస్ లో ఉండగా.. ఆ తర్వాత స్టివ్ వా 32 సెంచరీలు మూడవ స్థానంలో స్మిత్ 30 సెంచరీలతో కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఇప్పటికే రెండు మ్యాచ్లలో విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టు మూడో మ్యాచ్ ను కూడా కైవసం చేసుకోవడమే లక్ష్యంగా  అదిరిపోయే ప్రదర్శన చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: