ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంత ఘనంగా జరుగుతూ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారతావానికి స్వాతంత్రం రావడానికి ప్రాణాలు అర్పించిన మహనీయులను స్వాతంత్ర సమరయోధులు అందరిని కూడా ప్రస్తుతం భారత ప్రజానీకం మొత్తం గుర్తు చేసుకుంటూ ఇక గణతంత్ర దినోత్సవ వేడుకలను ఎంతో గర్వంగా జరుపుకుంటుంది. అయితే ఇక ఇలా గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలు కూడా ప్రస్తుతం వార్తలో హాట్ టాపిక్గా మారిపోయాయి. ఈ క్రమంలోనే క్రికెట్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే ఒక వార్త కాస్త ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి.


 ఏకంగా గణతంత్ర దినోత్సవం రోజున భారత జట్టు వన్డే ఫార్మాట్లో సాధించిన ఒకే ఒక విజయం గురించి ప్రస్తుతం తెలుసుకోవడానికి అభిమానులందరూ కూడా ఆసక్తి చూపిస్తున్నారు అని చెప్పాలి 2019లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా రిపబ్లిక్ డే రోజు జరిగిన వన్డే మ్యాచ్లో విజయం సాధించింది. టీమ్ ఇండియా జట్టు జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే రోజు  చాలానే మ్యాచులు ఆడినప్పటికీ ఇక గెలిచిన ఏకైక మ్యాచ్ మాత్రమే ఇది కావడం గమనార్హం. ఏకంగా 90 పరుగుల తేడాతో విజయం సాధించింది.


 అయితే ఇదే రోజున మూడు సందర్భాల్లో మ్యాచ్ ఆడింది టీమ్ ఇండియా. 1986లో ఆసీస్ చేతిలో 36 పరుగులు తేడాతో ఓడిపోయింది. ఇక 2000 సంవత్సరంలో అదే ఆస్ట్రేలియా చేతిలో 152 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఇక 2015లో ఇదే రోజున ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది. కానీ 2019లో మాత్రం విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా జట్టు ఇక మొదటిసారి విజయాన్ని అందుకుంది అని చెప్పాలి. ఈ మ్యాచ్లో భారత జట్టు 334 పరుగులు చేయగా లక్ష్య చేదనకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ 234 పరుగులకు ఆల్ అవుట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc