సాధారణంగా క్రికెటర్లకు సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగానే క్రేజ్ ఉంటుంది. అందుకే వారికి సంబంధించిన ఏ విషయం సోషల్ మీడియాలోకి వచ్చిన కూడా అది కేవలం నిమిషాల వ్యవధిలోనే వైరల్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే క్రికెటర్లు ఎవరైనా సరే ఇక తమ ప్రియురాలితో కెమెరా కంటపడ్డారు అంటే చాలు ఆ వీడియోలు ఫోటోలు ఇంటర్నెట్ ను షేర్ చేస్తూ ఉంటాయ్. ఇప్పటి వరకు ఎన్నోసార్లు ఇలా క్రికెటర్లకు సంబంధించిన ప్రేమ వ్యవహారాలు కూడా సోషల్ మీడియాను ఊపేసాయి అని చెప్పాలి.


 ఇకపోతే ఇటీవల ఒక మాజీ క్రికెటర్ కు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అయిన మైకల్ క్లార్క్ ఏకంగా నడిరోడ్డు మీద ప్రియురాలితో గొడవపడ్డాడు. ఈ క్రమంలోనే ప్రియురాలిని బూతులు తిట్టాడు. దీంతో ఇక ప్రియురాలు కూడా కోపంతో నువ్వు నన్ను మోసం చేశావు నా జీవితాన్ని నాశనం చేశావు అంటూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ చెంపలు వాయించింది అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొట్టింది.


 అయితే ఈ ఘటన నేపథ్యం లో ప్రస్తుతం అటు బీసీసీఐ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ కి ఊహించని షాక్ ఇచ్చింది అన్నది తెలుస్తోంది. వచ్చే నెల నుంచి జరగబోతున్న ఇండియా ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్కి కామెంటేటర్ గా ఉన్నాడు మైకల్ క్లార్క్. ఇక ఇప్పుడు అతని తొలగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అయితే ఇక ఇలా బీసీసీఐ సడన్గా అతని తొలగించడానికి అతను కొన్ని రోజుల క్రిందట గర్ల్ ఫ్రెండ్ తో నడిరోడ్డు మీద గొడవ పడడమే కారణం అన్నది తెలుస్తుంది.  అతని స్థానం లో మార్క్ వా కామెంట్రీ చేయబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: