ప్రపంచ క్రికెట్లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంత అత్యుత్తమ ఆటగాడిగా కొనసాగుతూ ఉన్నాడో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు విరాట్ కోహ్లీ క్రియేట్ చేసిన రికార్డులతో పోల్చి చూస్తే నేటి జనరేషన్ లో స్టార్ క్రికెటర్లు అందరూ కూడా అందనంత దూరంలో ఉన్నాడు విరాట్ కోహ్లీ. తన అరంగేట్రంతోనే తాను కేవలం అందరిలా జట్టులోకి వచ్చి పోయే ఆటగాడిని కాదు ప్రపంచ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఆటగాడిని అన్న విషయాన్ని నిరూపించాడు విరాట్ కోహ్లీ.


 ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ లో కూడా అద్భుతమైన ఆట తీరుతో టీమిండియా విజయంలో కీలకపాత్ర వహించాడు అని చెప్పాలి. కేవలం ఒకే ఫార్మాట్ కి మాత్రమే తన బ్యాటింగ్ విధ్వంసాన్ని పరిమితం చేయకుండా అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా రానిస్తూ ఎన్నో ప్రపంచ రికార్డులను కొల్లగొట్టాడు. ఇక నేటి జనరేషన్ క్రికెటర్లలో అటు విరాట్ కోహ్లీ ప్రతిభకు సరితూగే ఆటగాడు మరొకరు లేరు అని చెప్పడంలోనూ అతిశయోక్తి లేదు. అయితే ఈ విషయాన్ని ఎవరో చెప్పడం కాదు ఇక ప్రపంచకప్ క్రికెట్లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న వారే స్వయంగా ఒప్పుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు. అయితే గత కొంతకాలం నుంచి విరాట్ కోహ్లీ క్రియేట్ చేసిన రికార్డులను పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ బద్దలు కొడుతూ ఉన్నాడు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే పాకిస్తాన్ కెప్టెన్గా కొనసాగుతున్న బాబర్ అజాం గొప్ప లేకపోతే సీనియర్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గొప్ప అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఇటీవల ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ కోచ్ మిస్బాహుల్ హక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాబర్ కోహ్లీలలో ఎవరు గొప్ప అని పోల్చడం సరికాదు అంటూ వ్యాఖ్యానించాడు. కోహ్లీ ఇప్పటికే ఎన్నో మ్యాచ్లు ఆడేశాడు. బాబర్ ఇప్పుడిప్పుడే క్రికెట్ లో ఎదుగుతున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుత క్రికెట్లో విరాట్ కోహ్లీకి సరితోనే ఆటగాడు మరొకరు లేరు అంటూ వ్యాఖ్యానించాడు. కోహ్లీ ఆడినన్ని మ్యాచ్లు ఆడిన తర్వాత అప్పుడు బాబర్ ను కోహ్లీతో  పోల్చడం బాగుంటుంది అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: