
ఇక టీమ్ ఇండియా కెప్టెన్సీ రేసులో కూడా అందరిని వెనక్కి నెట్టేసి ముందు వరసలోకి వచ్చేసాడు. ఇక గత కొంతకాలం నుంచి సీనియర్లు దూరంగా ఉన్నప్పుడు తాత్కాలిక కెప్టెన్ గా కూడా అవకాశం దక్కించుకుంటున్నాడు అని చెప్పాలి. అయితే ఇక రీఎంట్రీ తర్వాత మాత్రం హార్దిక్ పాండ్యా మళ్ళీ తన అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. కెప్టెన్గా జట్టును ముందుకు నడిపించడమే కాదు ఒక ప్లేయర్ గా కూడా జట్టు విజయంలో కీలక పాత్ర వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే టి20 ఫార్మాట్లో హార్దిక్ పాండ్యా ఒక అరుదైన ఘనత సాధించాడు అని చెప్పాలి.
2013లో ముంబైతో తొలి టి20 ఆడిన హార్దిక్ పాండ్యా.. ఇప్పటివరకు 223 మ్యాచ్ లలో పాల్గొన్నాడు. అయితే 29.42 సగటు 4002 పరుగులు సాధించాడు. ఇందులో 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి అని చెప్పాలి. ఇక హార్దిక్ బెస్ట్ స్కోరు 91 పరుగులు కావడం గమనార్హం. అదే సమయంలో ఇక బౌలింగ్ లో కూడా అదరగొట్టాడు. 27.27 సగటుతో మొత్తంగా 145 వికెట్లు పడగొట్టాడు. నాలుగు వికెట్లను ఇక మూడు సార్లు సాధించాడు అని చెప్పాలి. ఇప్పుడు వరకు భారత జట్టుకు మూడు టి20 సిరీస్ లలో సారధ్యం వహించి మూడింటిలోనూ గెలిపించాడు.