ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఆస్ట్రేలియా భారత్ మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి. ఇక ఈ సిరీస్ కోసం అటు ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు రాబోతుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఈ టెస్ట్ సిరీస్ ఆడబోతుంది అని చెప్పాలి. అయితే గత ఏడాది భారత జట్టు ఇక ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి ఆసిస్ ను వారి సొంత గడ్డపైనే ఓడించింది. ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు భారత పర్యటనకు వస్తున్న ఆస్ట్రేలియా జట్టు ప్రతీకారాన్ని తీర్చుకోవాలని భావిస్తూ ఉంది అని చెప్పాలి.



 ఈ క్రమంలోనే ఇక అటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగు పెట్టాలి అంటే భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించడం భారత జట్టుకు తప్పనిసరి అయింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య కూడా హోరాహోరీ పోరు ఉండబోతుంది అన్నది తెలుస్తుంది. అయితే టెస్ట్ సిరీస్లో అటు ఆస్ట్రేలియా జట్టుకు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక పెద్ద సవాలుగా మారిపోతున్నాడు అని చెప్పాలి. అతన్ని ఎదుర్కోవడం పై ఇక ఆస్ట్రేలియా ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే భారత్ చేరుకొని ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్నారు ఆస్ట్రేలియా ఆటగాళ్లు.


 ఇలా ఒకవైపు ఆస్ట్రేలియా ఆటగాళ్లు మరోవైపు ఇండియా ఆటగాళ్లు కూడా ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్న వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి అని చెప్పాలి. అయితే రవిచంద్రన్ అశ్విన్ ను ఎదుర్కొనేందుకు ఇక ఆస్ట్రేలియా జట్టు ఒక సరి కొత్త ప్లాన్ ను సిద్ధం చేసుకుంది అన్నది తెలుస్తుంది. ఏకంగా ఇండియన్ బౌలర్ రవిచంద్రన్ ఇలాగే బౌలింగ్ చేసే విధంగా ఒక యువ బౌలర్ మహేష్ పితియాతో ప్రాక్టీస్ చేస్తున్నారు ఆస్ట్రేలియా ఆటగాళ్లు. ఇక ఈ విషయాన్ని ఇటీవలే ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ వెల్లడించారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: