భారత జట్టులో సీనియర్ ప్లేయర్లుగా అత్యుత్తమ ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. కోహ్లీ రోహిత్ కు ముందు భారత జట్టుకు కెప్టెన్ గా ఉంటే.. ఇక ఇప్పుడు రోహిత్ కెప్టెన్గా ముందుకు నడిపిస్తున్నాడు. అయితే ఇక ఇప్పుడు ఇద్దరు కూడా మంచి మిత్రులుగా ఉన్నారు అని చెప్పాలి. కానీ గతంలో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు ఏర్పడ్డాయని.. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు అని సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరిగింది. వీరిద్దరి మధ్య విభేదాలు  ఇక టీమ్ ఇండియా జట్టు విజయాలపై ప్రభావితం చేస్తున్నాయి అంటూ ఎంతోమంది చర్చించుకోవడం మొదలుపెట్టారు.


 ఆ తర్వాత కాలంలో మాత్రం విరాట్ కోహ్లీకి రోహిత్ శర్మ.. రోహిత్ శర్మకు విరాట్ కోహ్లీ మద్దతుగా నిలుస్తూ మాట్లాడటంతో వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ వచ్చిన వార్తలు కేవలం పుకార్లు మాత్రమే అని అందరూ అనుకున్నారు.  కానీ వీరిద్దరి మధ్య నిజంగానే విభేదాలు ఏర్పడ్డాయి అన్న విషయాన్ని టీమ్ ఇండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీదర్ స్పష్టం చేశాడు. 2019 వరల్డ్ కప్ తర్వాత జట్టులో కాస్త గందరగోళ పరిస్థితి నెలకొంది.. డ్రెస్సింగ్ రూమ్ లో వాతావరణంపై గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అప్పటికే మేము సెమీఫైనల్ లో న్యూజిలాండ్ స్థితిలో ఓడిపోయాం. అలాంటి సమయంలో విరాట్, రోహిత్ మధ్య విభేదాలు ఉన్నాయని వార్త మమ్మల్ని అందరినీ ఆందోళనకు గురి చేసింది.


 డ్రెస్సింగ్ రూమ్ లో జట్టులోని ఆటగాళ్లందరూ రోహిత్ క్యాంప్, విరాట్ క్యాంప్ అంటూ విడిపోయారని విషయం తెలిసింది. ఇక సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు అన్ ఫాలో చేసుకున్నారు. అయితే వరల్డ్ కప్ ముగిసిన పది రోజులకి భారత జట్టు యునైటెడ్ స్టేట్స్ కు వెళ్ళింది.  అప్పుడు హెడ్ కోచ్గా ఉన్న రవిశస్త్రి.. కోహ్లీ,  రోహిత్ లను తన గదికి పిలిచాడు. భారత క్రికెట్ ఆరోగ్యం బాగుండాలంటే ఇద్దరి మధ్య విభేదాలను తుడిచిపెట్టేయాలంటూ అతను సూచించాడు. ఇద్దరికీ ఎంతగానో నచ్చ చెప్పాడు. వీరిద్దరూ జట్టులో సీనియర్లు కాబట్టి మీ మధ్య మనస్పర్ధలు ఉండకూడదు. ఇవన్నీ విడిచిపెట్టి జట్టును ముందుకు నడిపించడంలో కృషి చేయండి అంటూ రవిశాస్త్రి సూచించడంతో ఇక వీరిద్దరి మధ్య విభేదాలు సద్దుమణిగాయ్ అంటూ టీమిండియా మాజీ ఫీల్డింగ్  కోచ్ ఆర్ శ్రీధర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: