
ముఖ్యంగా ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు అందరూ కూడా ఇక భారత్ లో స్పిచ్ లపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తూ ఉండడం గత కొంతకాలంగా హాట్ టాపిక్ గా మారిపోయింది భారత్‌లో సరైన పిచ్ లను తయారు చేస్తే ఆస్ట్రేలియానే విజయం సాధిస్తుందంటూ వ్యాఖ్యానిస్తున్నారు ఆస్ట్రేలియా మాజీలు. ఈ క్రమంలోనే ఇదే విషయంపై టీమిండియా మాజీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. పిచ్ ల గురించి అదే పనిగా మాట్లాడటం ఆస్ట్రేలియా వ్యూహంలో భాగమే అంటూ చెప్పుకొచ్చాడు
బ్రిస్ బెన్ లో దక్షిణాఫ్రికా తో ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసిపోయింది. ఆ మ్యాచ్‌కు సిద్ధం చేసిన పిచ్ సంగతి ఏంటి.. అలాంటి పిచ్ పై ఆడటం నిజంగా ఆటగాళ్ల ప్రాణాలకు ప్రమాదం. కానీ స్పిన్ పిచ్‌ల వల్ల పోయేది ప్రాణాలు కాదు.. ఆటగాళ్ల పేరు మాత్రమే. బ్రిస్బెన్ పిచ్ పై ఆడుతున్నప్పుడు ఇరు జట్ల బ్యాట్స్మెన్ల గుండెలు నోట్లోకి వచ్చాయి. కాబట్టి బౌలర్లకు అవకాశం ఇవ్వాలి. ఇటీవల కాలంలో క్రికెట్ అనేది బ్యాట్స్‌మెన్ ఆటగా మారిపోయింది. టెస్ట్ మ్యాచ్‌లో స్పిన్ ఆడటం ఒక బ్యాట్స్‌మెన్ కి ఉత్తమమైన సవాలు. టర్న్ అయ్యే బంతులు బ్యాట్స్‌మెన్ యొక్క ఫుట్ వర్క్ ను పరీక్షిస్తాయి అంటూ సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.