
ఇక్కడ ఒక ప్లేయర్ ఏకంగా క్యాచ్ అందుకునే క్రమంలో డైవ్ చేశాడు. కానీ చివరికి తీవ్రంగా గాయపడ్డాడు. ఇక అతను కనీసం నడవలేని స్థితిలో ఉండడంతో స్ట్రచర్ పై అతన్ని మైదానం బయటికి తీసుకెళ్లారు. ఇటీవల ఇంటర్నేషనల్ టీ20 లీగ్ లో భాగంగా షార్జా వారియర్స్, గల్ఫ్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. గల్ఫ్ జెయింట్స్ ఆటగాడు వెస్టిండీస్ ఆల్ రౌండర్ దోమినిక్ డ్రెక్ క్యాచ్ అందుకునే క్రమంలో తీవ్రంగా గాయపడ్డాడు. షార్జా వారియర్స్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన బ్రాత్ వైట్ బౌలింగ్లో మోయిన్ అలీ భారీ షాట్ కు ప్రయత్నించాడు. అయితే ఆ షాట్ మిస్ టైం అయి గాల్లోకి లేచింది.
ఈ క్రమంలోనే బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న డొమినిక్ బ్రేక్ పరిగెత్తుకుంటూ వచ్చి అద్భుతమైన డైవింగ్ చేస్తూ క్యాచ్ ని అందుకున్నాడు. క్యాచ్ అయితే అందుకున్నాడు కానీ తీవ్రంగా గాయాల పాలయ్యాడు. ఈ క్యాచ్ అందుకునే క్రమంలో అతని ముఖం నేలకు బలంగా తగిలింది. దీంతో అతను తీవ్రమైన నొప్పితో మైదానంలో విలవిలలాడిపోయాడు అని చెప్పాలీ. వెంటనే మెడికల్ సిబ్బంది పరుగులు పెట్టుకుంటూ మైదానంలోకి వచ్చి ఇక లేవలేని స్థితిలో ఉన్న అతన్ని స్ట్రచర్ సహాయంతో బయటకి తీసుకువెళ్లారు. ఈ వీడియో ట్విటర్లు వైరల్ గా మారింది.