ప్రతి మనిషి జీవితంలో పెళ్లి అనేది ఎంతో ప్రత్యేకమైనది. పెళ్లి చేసుకుని ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలని యువతీ యువకులు కూడా ఆశపడుతూ ఉంటారు. అయితే కొంతమంది ప్రేమించి ఇక తమను బాగా అర్థం చేసుకున్న వారిని పెళ్లి చేసుకుంటే.. మరి కొంతమంది ఇక పెద్దలు కుదిర్చిన  వివాహాన్ని చేసుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలా ప్రతి ఒక్కరు కూడా తమ జీవితానికి పెళ్లి అనే బంధంతో కొత్త అర్ధాన్ని చెబుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇటీవల కాలంలో పెళ్లి విషయంలో కూడా కొంతమంది కమర్షియల్ గానే ఆలోచిస్తున్నారు. ఎక్కువ డబ్బు సంపాదించి బాగా సెటిల్ అయిన తర్వాతనే పెళ్లి గిల్లి అనే ఆలోచన చేయాలని అనుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇక్కడ ఒక దేశంలో మాత్రం అసలు యువతి యువకులు పెళ్లిళ్లు చేసుకోవడం లేదట. పెళ్లి పేరు చెబితే చాలు ఆమడ దూరం పారిపోతూ ఉన్నారట. ఇక ఇలా పెళ్లిళ్లు జరగక పోవడంతో ఇక ఆ దేశంలో సంతానోత్పత్తి కూడా రికార్డు స్థాయిలో తగ్గిపోతుంది అన్నది అర్థమవుతుంది. ఆ దేశం ఏదో కాదు దక్షిణ కొరియా. ప్రపంచంలోనే అతి తక్కువ సంతానోత్పత్తి కలిగిన దేశంగా రికార్డుల్లో ఉంది దక్షిణ కొరియా.


 దీనికి కారణం దక్షిణ కొరియాలో యువతి యువకులు ఎవరు కూడా పెళ్లి చేసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదట. దీంతో ఆ దేశంలో వివాహాల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది అని చెప్పాలి. దక్షిణ కొరియా జాతీయ గణాంకల కార్యాలయ డేటా ప్రకారం.. 2021లో వివాహ రేటు 3.8 ఉండగా.. 2022లో 3.7కు పడిపోయింది. కాగా 2022లో1,91,700 వివాహాలు జరగగా.. ఇక అంతకుముందు సంవత్సరంతో పోల్చి చూస్తే 0.4% తగ్గింది. ఇక సంతానోత్పత్తిలో కూడా మరింత తగ్గుదల ఉంది అన్నది మాత్రం అక్కడి గణాంకాలు సూచిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: