ఇటీవల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా తో టీమ్ ఇండియా నాలుగు మ్యాచ్లు టెస్ట్ సిరీస్ లో భాగంగా హోరాహోరీగా పోరాడింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ టెస్ట్ సిరీస్ లో ఆస్ట్రేలియా ఒక విజయం సాధిస్తే భారత్ రెండు విజయాలు సాధించింది. కానీ చివరికి నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రాగ ముగియడంతో 2-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది టీమ్ ఇండియా జట్టు. అంతేకాదు ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా అడుగుపెట్టింది అన్న విషయం తెలిసిందే.


 ఇకపోతే ఇక టెస్ట్ సమరం ముగిసిన తర్వాత ఇక ఇప్పుడు భారత్, ఆస్ట్రేలియా జట్ల వన్డే సిరీస్ లో అమీ తుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి అని చెప్పాలి. అయితే ఇప్పటికే టెస్టు సిరీస్ ఓడిపోయిన ఆస్ట్రేలియా జట్టు అటు వన్డే సిరీస్ లో మాత్రం తప్పక విజయం సాధించాలి అని ఎంతో పట్టుదలతో ఉంది అని చెప్పాలి. ఇక మరోవైపు ఇప్పటికే టెస్టు సీరిస్ గెలుచుకున్న టీమిండియా జట్టు అదే జోరును వన్డే సిరీస్ లో కూడా కొనసాగించాలని భావిస్తుంది అని చెప్పాలి. ఇక ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ దూరంగా ఉండటంతో వైస్ కెప్టెన్ గా ఉన్న స్మిత్ సారధ్య బాధ్యతలను నిర్వహించబోతున్నాడు.


 అదే సమయంలో వ్యక్తిగత కారణాల దృశ్య అటు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి వన్డే మ్యాచ్ కు అందుబాటులో ఉండడం లేదు. దీంతో ఇక వైస్ కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యా మొదటిసారి వన్డే జట్టు కెప్టెన్సీ చేపట్టి జట్టును ముందుకు నడిపించబోతున్నాడు అని చెప్పాలి. కాగా ఇక ఇరు జట్ల మధ్య మొదటి మ్యాచ్ నేడు వాంకడే మైదానంలో జరగబోతుంది అని చెప్పాలి. గత కొంతకాలం నుంచి ఈ ఫార్మాట్లో టీమ్ ఇండియా వరుస విజయాలు సాధిస్తూ దూకుడు మీద ఉండగా.. దాదాపు నాలుగు నెలల గ్యాప్ తర్వాత వన్డే ఫార్మాట్లో మ్యాచ్ ఆడబోతుంది ఆస్ట్రేలియా జట్టు.

మరింత సమాచారం తెలుసుకోండి: