ముంబైలోని వాంఖడే  స్టేడియం వేదికగా జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో టీమిండియా ఎంతలా అధిపత్యాన్ని కొనసాగించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పటిష్టమైన ఆస్ట్రేలియాను అటు 188 పరుగులకు అలౌట్ చేసింది టీమిండియా. ముఖ్యంగా అటు భారత బౌలర్లలో మహమ్మద్ షమీ సిరాజ్ లు అయితే తమ బౌలింగ్ తో నిప్పులు చెరిగారు అని చెప్పాలి. వైవిద్యమైన బంతులు సంధిస్తూ అటు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లను ముప్పు తిప్పులు పెట్టారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇక ఎవరూ కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. చివరికి ఆస్ట్రేలియా జట్టు 188 పరుగులకు.. అది కూడా 35.4 ఓవర్లలోనే ఆల్ అవుట్ అయ్యే పరిస్థితి వచ్చింది. అయితే ఇక భారత బౌలర్లు మాత్రమే కాదు ఇక ఆస్ట్రేలియా జట్టులో ఫాస్ట్ బౌలర్గా కొనసాగుతున్న మిచెల్ స్టార్క్ సైతం ఇక తన ప్రదర్శనతో పర్వాలేదనిపించాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారతతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో కీలకమైన విరాట్ కోహ్లీ వికెట్ కూడా పడగొట్టాడు అని చెప్పాలి. ఇక ఈ వికెట్ తీయడం ద్వారా ఒక అరుదైన ఫీట్ అందుకున్నాడు మిచెల్ స్టార్క్.


 అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక వికెట్లు తీసిన నాలుగవ ఆస్ట్రేలియన్ బౌలర్గా రికార్డ్ సృష్టించాడు అని చెప్పాలి. ఇప్పటివరకు మిచెల్ స్టార్కు వన్డే, టెస్ట్ లు, t20 లు కలిపి 591 వికెట్లు తీశాడు. ఇక ఓవరాల్ గా ఈ జాబితాలో స్పిన్నర్ షేన్ వార్న్  999 వికెట్లతో తొలి స్థానంలో ఉండగా.. గ్లెన్ మెక్క్రాత్ 948 వికెట్లతో రెండవ స్థానంలో ఉన్నాడు. బ్రెట్ లి 718 వికెట్లతో మూడో స్థానంలో ఉండగా.. మిచెల్ స్టార్క్ 591 వికెట్లతో నాలుగవ స్థానంలోకి చేరుకున్నాడు అని చెప్పాలి. ఇక ఐదవ స్థానంలో మిచెల్ జాన్సన్ 590 వికెట్లతో కొనసాగుతూ ఉన్నాడు

మరింత సమాచారం తెలుసుకోండి: