ఐపీఎల్ సీజన్ మొదలయ్యిందంటే చాలు క్రికెట్ ప్రియులు చాల సంబరపడిపోతూ ఉంటారు. ఈరోజు నుంచి ఐపీఎల్ 16వ సీజన్ మొదలు కాబోతోంది. మొదటి పోరులో చెన్నైతో ,గుజరాత్ టీమ్ పోటిపడనుంది. ఈరోజు రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ లో ,జియో సినిమాలో ప్రత్యేకంగా ప్రసారం చేయనున్నారు. ఈ మ్యాచ్ తర్వాత ధోని చెన్నై టీం కి గుడ్ బై చెప్పబోతున్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అందుచేత ఈసారి ఎలాగైనా ట్రోఫీ సాధించాలని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.


ఈ రోజున మొదటి మ్యాచ్ గుజరాత్ టైటాన్ చెన్నై సూపర్ కింగ్ మధ్య జరగనుంది. గత సీజన్లో మొదటి మ్యాచ్ ఆడినప్పుడు సీఎస్కే ఫలితాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.. 2009లో ముంబై ఇండియన్స్ చేతుల 19 పరుగులు తేడాతో ఓడిపోయింది చెన్నై సూపర్ కింగ్స్. ఆ తరువాత 2011లో సీఎస్కే 2 పరుగుల తేడాతో ముంబైని ఓడించింది.. 2012లో ముంబై చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది చెన్నై సూపర్ కింగ్స్.


2018 లో చెన్నై సూపర్ కింగ్ ఒక వికెట్ తేడాతో ముంబైని ఓడించడం జరిగింది. ఇక 2020లో చెన్నై సూపర్ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో ముంబై ని ఓడించింది. కోల్కత్తా నైట్ రైడర్స్ చేతిలో 2022లో ఆరు వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్ ఓడిపోవడం జరిగింది. మరి దీన్ని బట్టి చూస్తే.. ఈసారి గుజరాత్ టీం తో చెన్నై సూపర్ కింగ్స్ ఏ విధంగా పోటీ పడనుందో తెలుస్తోంది.. చెన్నై సూపర్ కింగ్స్ గెలిచే అవకాశం తక్కువగా ఉందని తెలుస్తోంది మరి ధోని మ్యాజిక్ చేసి ఈ మ్యాచ్ని గెలుస్తారేమో చూడాలి మరి. కచ్చితంగా ఈసారి ఎలాగైనా కప్పు కొట్టి చెన్నై సూపర్ కింగ్స్ నుండి ధోని రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: