మొన్నటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా తన ఆట తీరుతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన ఆఫ్ఘనిస్తాన్  స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ ఇక ఇప్పుడు ఐపిఎల్ ముగిసిన నేపథ్యంలో మళ్లీ దేశం తరఫున ఆడేందుకు సిద్ధమయ్యాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆఫ్గనిస్తాన్ ఆడబోయే వరుస సిరీస్ లకు అందుబాటులో ఉండడానికి సొంత దేశానికి చేరుకున్నాడు. అయితే ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు అని చెప్పాలి. 17 మ్యాచ్ లు ఆడినరా రషీద్ ఖాన్  8.23 ఎకానమీతో 27 వికెట్లు పడగొట్టాడు.


 జట్టుకు అవసరమైనప్పుడు బ్యాట్ తో కూడా రానించాడు అని చెప్పాలి. అయితే గుజరాత్ జట్టు టైటిల్ పోరులో ఒక్క అడుగు దూరంలో ఆగిపోయి రన్నరప్ తో సరిపెట్టుకుంది. ఇదిలా ఉంటే రషీద్ ఖాన్ ఆఫ్ఘనిస్తాన్ జట్టులో చేరాడు అన్న ఆనందం ఇక ఆ టీం కి లేకుండా పోయింది అని చెప్పాలి. ఎందుకంటే శ్రీలంకతో వన్డే సిరీస్ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టుకి భారీ షాప్ తగిలింది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఇక గాయం కారణంగా తొలి రెండు మ్యాచ్లకు దూరం కాబోతున్నాడట. వెన్నునొప్పి కారణంగా అతను ఇక జట్టు నుంచి పక్కకు తప్పుకున్నాడు అన్నది తెలుస్తుంది. ఈ విషయాన్ని అప్పనిస్తాన్ క్రికెట్ బోర్డు ధృవీకరించింది.


 మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంకలో పర్యటించబోతుంది. జూన్ రెండు నుంచి 4,7 తేదీలలో ఇక ఈ మ్యాచ్లు నిర్వహించబోతున్నారు అని చెప్పాలి. మహీంద రాజపక్ష స్టేడియంలో ఈ మూడు మ్యాచ్ లు జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు. హస్మతుల్లా షాహిదీ సారధ్యం వహించబోతున్నాడు. ఈ జట్టులో రషీద్ ఖాన్ కు చోటు దక్కింది. ఐపీఎల్ కారణంగా అతను కాస్త ఆలస్యంగా జట్టులో చేరబోతున్నాడని వార్తలు వినిపించాయి. కానీ అసలు కారణం వెన్నునొప్పి అని.. వెన్ను నొప్పి కారణంగానే రెండు మ్యాచ్లకు రషీద్ ఖాన్ దూరమైనట్లు బోర్డు ఇటీవల ధ్రువీకరించింది. ప్రస్తుతం రషీద్ ఖాన్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: