
2014 ఎలక్షన్లకు ముందు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి పదవి కోసం బిజెపితో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్ళింది. అయితే ఆ సంవత్సరం జరిగిన ఎలక్షన్స్ లో టిడిపి విజయం సాధించింది. అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు తిరిగి తన వెన్నుపోటు ధోరణిని ప్రదర్శించారు. తిరిగి బీజేపీని పక్కన పెట్టడం మొదలుపెట్టారు. అలాగే మోడీని విమర్శించడం కూడా మొదలు పెట్టారు.
అవన్నీ భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి గుర్తు ఉంటాయి మోడీకి కూడా గుర్తు పెట్టుకునే ఉంటారు అంటున్నారు. కానీ మోడీ ఇప్పుడు డైరెక్టుగా చంద్రబాబునాయుడుని హ్యాండిల్ చేయడం లేదు. మధ్యలో జగన్ అనే ఒక అస్త్రాన్ని, జగన్ కి ఉన్న ప్రతీకారాన్ని వాడుకుంటున్నారని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే కేంద్రం ఇంతకుముందు కవిత కేసులో కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు.
ఈడిని తన పని ఏదో తాను చేసుకోమన్నట్లు వదిలేసింది కేంద్ర ప్రభుత్వం. అలాగని పూర్తిగా వదిలేయకుండా జగన్ ని వాడి చంద్రబాబు నాయుడిపై కేసు పెట్టించడం, అరెస్టు చేయించడం చేసింది అంటున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు చేయించాలంటే కేంద్రం ఎప్పుడో అరెస్ట్ చేయించవచ్చు. అరెస్టు చేయాలంటే షాపోంజి పల్లంజీ దగ్గర దొరికిన ఆధారాలు, శ్రీనివాస్ రావు దగ్గర దొరికిన డాక్యుమెంట్లు ఇలాంటి ఆధారాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటి ద్వారా కేంద్రం చంద్రబాబు నాయుడుని ఎప్పుడో జైల్లో పెట్టేది. కానీ అది రాష్ట్ర ప్రభుత్వం పని అన్నట్లుగా వదిలేసింది అంటున్నారు వాళ్లు.