తెలుగు రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా జరుపుకునే పండుగ సంక్రాంతి. మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి సంబరాలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా జరుగుతూ వుంటాయి.ఇక  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఈ సంబరాలకు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆంధ్రప్రదేశ్ లో జరిగే  రెండు కళ్ళు సరిపోవు అని అనడం అతిశయోక్తి లేదు. మునుపెన్నడూ చూడని విధంగా అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు జరుగుతూ ఉంటాయి. ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు అందరూ సొంతూళ్లకు చేరుకుని సందడి చేస్తుంటారు . ఇక కొత్త అల్లుళ్లు అందరూ అత్తమామల ఇంటికి చేరుకుని సంక్రాంతి పండుగ ఎంజాయ్ చేస్తు హడావిడి  చేస్తున్నారు. 

 

 

 పొద్దున్నే లేచి అందరి వాకిళ్ళ కంటే  మన వాకిలి బాగుండాలని రంగురంగుల రంగవల్లులు అద్ది సంతోష పడుతూ ఉంటే.. గాలిపటాలు ఎగురవేస్తూ పిల్లలు తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరోవైపు కోడి పందాలు ఎడ్ల పందేలతో పెద్దలు అందరూ హోరెత్తి  పోతుంటారు. దీంతో సంక్రాంతి జరిగే మూడు రోజుల పాటు ఆనందం వెల్లివిరిసి... సంబరాలు అంబరాన్ని అంటుతాయి . ఇక కోడి పందాలలో పెద్దలు చేసే హడావిడి అయితే మామూలుగా ఉండదు. నా పుంజు గెలుస్తుందని ఒకరు లేదు నా  పుంజే  గెలుస్తుందని ఇంకొకరు ఇలా  బెట్టింగులు కాస్తుంటారు. ఇక ఈ కోడిపందాలు బెట్టింగ్లు కాయడానికి ఇతర రాష్ట్రాల  నుంచి ఎంతోమంది ప్రముఖులు కూడా వస్తూ ఉంటారు. 

 

 

 ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా ఇదంతా జరిగేది కేవలం గ్రామాల్లో మాత్రమే. ఆధునిక పోకడకు అలవాటుపడి సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటారో  కూడా చాలామంది మర్చిపోతున్నారు. కీట్టి  పార్టీ వినోదాలు,  స్నేహితులతో షికార్లు ఇవే లోకంగా బతికేస్తున్న మహిళలు ఎంతో మంది. ఇవే లైఫ్లో ఆనందాన్ని ఇస్తాయి అని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్లను గ్రామాల్లో జరిగే సంక్రాంతి పండుగకు తీసుకుపోతే  అసలు సిసలైన ఆనందం ఏమిటో అప్పుడు తెలుస్తుంది కదా. కాబట్టి పండగ పూట అయినా సరే గ్రామాలకు వెళ్లి భార్యలు సంస్కృతి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే తరానికి పిండి వంటలు నేర్పించాల్సింది మీరే. పిండివంటల భవిష్యత్తు మీరే. మీ  పిల్లలందరికీ తెలుగు సంస్కృ తి నేర్పించి అలవరచాలి అంటే ముందు మీరు నేర్చుకోవాలి కదా అందుకే పండుగలప్పుడైనా ఊర్లో కి వెళ్ళండి  మహిళలు .

మరింత సమాచారం తెలుసుకోండి: