ఏ గృహమైతే లక్ష్మీ నివాసమై ఉంటుందో ఆ ఇల్లు అష్ట ఐశ్వర్యాలతో, భోగ భాగ్యాలతో వర్ధిల్లుతుంది .అందుకే ప్రతి ఒక్కరూ ఆ శ్రీ మహాలక్ష్మి కృప కోసం ఎన్నో రకాలు పూజలు, పునస్కారాలు, వ్రతాలు జరుపుతుంటారు. అందుకోసం ప్రతి గృహిణి ఆరాధ్య దేవత మరియు మాత లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఏ పనులు చేస్తే లక్ష్మీ దేవి అమ్మ అనుగ్రహం పొందుతుంది అన్న విషయమై అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఆ మాతకు అసలు నచ్చని పనులు కొన్ని ఉన్నాయి...అవేంటో ఇపుడు తెలుసుకుందాం. మొదటగా పూజా మందిరం ఎల్లప్పుడూ ఎంతో శుభ్రంగా ఉంచుకోవాలి.
అలాగే ప్రతి రోజూ మీ ఇంటిలో సాయంత్రం పూట పూజా మందిరంలో తప్పక దీపారాధన చేయాలి. చేయకుండా ఉండరాదు. ఇది అమ్మవారికి నచ్చదు. గడప పైన నిలబడి ఏ పని చేయరాదు. సాయంత్రం పూట ఇంటిలోని చెత్తను బయట పడవేయ రాదు. ఉప్పును, నూనె ను ఎవరికి అరువు ఇవ్వరాదు. అన్నాన్ని నిర్లక్ష్యం చేయరాదు. అన్నం ముందు పెట్టుకుని కూర్చుని తినకుండా కాలయాపన చేయరాదు. పై విషయాలు అన్నీ గుర్తు పెట్టుకుని పాటిస్తే మీకు లక్ష్మి దేవి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది మరియు మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో విలసిల్లుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి