హిందువులు దేవుడ్ని ఎంతగానో విశ్వసిస్తుంటారు. ఒక్కొక్కరు ఒక్కో దేవుడ్ని ప్రత్యేకించి కొలుస్తూ వారి ఇష్ట దైవంగా పూజిస్తుంటారు. వాస్తవానికి దేవుడి యొక్క అవతారాలు ఎన్నో. కానీ దైవం మాత్రం ఒక్కటే. కాక పోతే ప్రజలు తమ దేవుడి యొక్క వివిధ అవతారాలలో వారికి ప్రీతికరమైన రూపాన్ని ఆరాధిస్తుంటారు. ఈ అనంతమైన విశ్వాన్ని నడిపించే దైవం ఒక్కటే. ఇక దేవుడ్ని పూజించడానికి కొందరు రకరకాల పుష్పాలతో పూజా మందిరాన్ని అలకరించి, రకరకాల నైవేద్యాలతో ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. మరి కొందరు వారికి వీలైనంతలో పుష్పాలతో పూజ గదిని అలంకరించి, నైవేద్యం కోసం ఏదైన ఫలాన్ని కానీ, టొమాటో పండును కానీ, చక్కెరను కానీ నైవేద్యంగా సమర్పించి పూజిస్తుంటారు. 

అలాగని బాగా ఘనంగా పూజ చేసిన వారికి ఎక్కువ అనుగ్రహం అలాగే తక్కువగా అనగా స్థోమతకు తగ్గట్టుగా ఉన్నంతలో పూజ చేయడం ద్వారా అందుకు తక్కువ  అనుగ్రహం ఉండదు. దైవం దృష్టిలో అందరూ సమానులే. కాకపోతే ఎవరైతే నిర్మల మైన మనసుతో,  భక్తి శ్రద్ధలతో,  పూర్తి విశ్వాసంతో ఆ దేవుడ్ని పూజిస్తారో అటువంటి వారికి అధికంగా పూజ ఫలితం లభిస్తుందే తప్ప, చిన్న పూజ, పెద్ద పూజ అన్న భేదాలు ఉండవు. దేవుని చల్లని చూపు, కృప పొందాలంటే పూజ చేసే విధానం కన్నా పూజించే మనసు మిన్న వారి యొక్క భక్తి మిన్న అంటారు పెద్దలు.

మనసులో ఇతరులపై ద్వేషాన్ని పెట్టుకుని, అవతలి వారు బాగుపడకూడదు అనే మనస్తత్వం ఉండేవారు. ఎప్పటికీ ఆ దేవుని యొక్క పాత్రులు కాలేరు. అందుకే పెద్దలు అంటుంటారు ఆ దేవుని యొక్క చల్లని చూపు ఉంటే పేదరికం అయినా సంతోషంగా గడిచి పోతుంది. అలాగే ఆ దేవుడి ఆశీస్సులు మనపై లేనప్పుడు బంగారు పరుపైన కునుకు తీయనివ్వదు. అందుకే దేవుడిపై భక్తి చాలా ప్రధానమైనది.

మరింత సమాచారం తెలుసుకోండి: