ఇంటిని నిర్మించే విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సందర్భాల్లో వాస్తు దోషాల వల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వాస్తు దోషాలు ఉన్న ఇంట్లో వినాయకుని విగ్రహం పెట్టడం ద్వారా ఆ దోషాలను తొలగించుకునే అవకాశం ఐతే ఉంది. వినాయకుడిని పూజించడం ద్వారా విఘ్నలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారనే సంగతి తెలిసిందే. సాధారణంగా హిందువులు విఘ్నేశ్వరుడిని పూజిస్తారు.

అయితే  వాస్తు శాస్త్రంలో జ్యోతిష్యంలో సైతం వినాయకునికి ప్రత్యేక స్థానం ఉందని చెప్పవచ్చు.  గణపతి విగ్రహం   ఎప్పుడూ 11 అంగుళాల వెడల్పు, ఆరు అంగుళాల పొడవు కంటే ఎక్కువగా ఉండకూడదు.  గణపతి  విగ్రహాన్ని పడమర లేదా ఉత్తరం లేదా ఈశాన్యం  దిశలో  ప్రతిష్టించడం ద్వారా అనుకూల ఫలితాలు కలిగే ఛాన్స్  అయితే ఉంటుంది.

గణపతిని పూజించడం ద్వారా అదృష్టంతో పాటు  ఆనందం దక్కుతుంది.  ఉత్తరం వైపు గణపతి విగ్రహం ఉంటే  అదృష్టం మరింత ఎక్కువగా కలిసొస్తుందని  చెప్పవచ్చు.  అయితే ఒకటి కంటే ఎక్కువ వినాయక విగ్రహాలు ఇంట్లో పెట్టుకోవడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా కలిగే ఛాన్స్ అయితే ఉంటుంది.  అయితే చినిగిన లేదా విరిగిన వినాయకుని విగ్రహాలను మాత్రం  ఇంట్లో  ఎట్టి పరిస్థితుల్లోనూ  పెట్టుకోకూడదని చెప్పవచ్చు.

తెల్లటి గణేశ విగ్రహం శాంతి మరియు శ్రేయస్సును సూచిస్తుంది.  సింధూర రంగు వినాయకుని విగ్రహం స్వీయ-వృద్ధి మరియు విజయాన్ని సూచించే అవకాశాలు ఉంటాయి.  వాస్తు ప్రకారం, కూర్చున్న భంగిమలో ఉన్న వినాయకుని విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం అనుకూల ఫలితాలను ఇస్తుంది.   ఇంట్లో విగ్రహాన్ని ప్రతిష్టాపించేటప్పుడు, శుభ ముహూర్తంలో  ప్రతిష్టించాలి.  విగ్రహాన్ని ఇంట్లో ఉంచిన తర్వాత, క్రమం తప్పకుండా పూజలు చేయడం, నైవేద్యాలు సమర్పించడం మరియు మంత్రాలను జపించడం వంటివి  చేస్తే అనుకూల ఫలితాలు వస్తాయి.

ఇంట్లో గణపతి యంత్రం పెట్టుకోవడం వల్ల  దురదృష్టం తొలగిపోతుంది.  గణపతి యంత్రం వల్ల  శ్రేయస్సు, అదృష్టంతో  పాటు సంపద కలుగుతుదని చెప్పవచు.

మరింత సమాచారం తెలుసుకోండి: