ఒంటిచేత్తో మ్యాచ్ లను గెలిపించే  కలకత్తా ఆటగాడి సొంతం... ఎలాంటి బంతినైనా  బౌండరీ దాటించ గల పవర్ అతని సొంతం.. బరిలోకి దిగి బ్యాటింగ్ చేస్తున్నాడు అంటే బౌలర్ల  గుండెల్లో గుబులు పుడుతోంది... ప్రతి బంతి కూడా బౌండరీ లైన్ దాటుతూ ఉంటుంది.. అందుకే ఆ ఆటగాని తీసుకునేందుకు అన్ని జట్లు పోటీ పడుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇటీవలే జరిగిన ఐపీఎల్ సీజన్ లో ఆటగాడి పేలవ ప్రదర్శనతో జట్టు ఒక రకంగా ఓటమి చవిచూసింది అనే చెప్పాలి ఎన్నో అంచనాల మధ్య జట్టు యాజమాన్యం కొనుగోలు చేసినప్పటికీ... ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది.


 ఆ ఆటగాడు ఎవరో కాదు ఐపీఎల్ లో పవర్ హిట్టర్  గా ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్న అండ్రు రస్సెల్ . అయితే వచ్చే ఐపీఎల్ సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ ఫ్రాంచైజీ అండ్రు రస్సెల్ ని  వదిలేయనుందా  అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి కారణం ఐపీఎల్ సీజన్ లో ఘోరంగా విఫలం కావడమే. దీంతో ఇప్పటికే కష్టాల్లో తూగుతున్న కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు పవర్ హిట్టర్ ఆండ్రూ రస్సెల్ భారంగా మారిపోయాడు. ఐపీఎల్లో 10 మ్యాచ్లు ఆడి 117 పరుగులు మాత్రమే చేశాడు అండ్రు రస్సెల్. అటు బౌలింగ్ లోనూ పూర్తిగా తేలిపోయాడు.



 ఇక రస్సెల్ ఫెయిల్యూర్ జట్టుపై ఎంతగానో ప్రభావం చూపింది.  దీంతో కనీసం ప్లే ఆఫ్  కి కూడా అర్హత సాధించలేకపోయింది కోల్కతా నైట్ రైడర్స్ జట్టు. దీంతో జట్టులో  అండ్రు రస్సెల్ పై వేటు వేసేందుకు జట్టు ఫ్రాంచైజీ సిద్ధంగా ఉంది అని ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. సాధారణంగా అయితే అండ్రు రస్సెల్ లాంటి  పవర్ హీటర్ కోల్కతా నైట్ రైడర్స్ జట్టు లో ఉండడం మాత్రం జట్టుకు ఒక రకంగా బలం అన్న విషయం తెలిసిందే. కానీ ఐపీఎల్ 2020 సీజన్ లో   అండ్రు రస్సెల్ ఆట తీరు మాత్రం జట్టుకు మరింత బలహీనం గా మారిపోయింది. దీంతో రాబోయే సీజన్లో అండ్రు రస్సెల్ పై వేటు పడటం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: