ఇటీవలే ఐపీఎల్లో డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్ యొక్క ప్రస్థానం ముగిసింది. గత రెండు సీజన్ల నుంచి వరుసగా టైటిల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ఈసారి కూడా టైటిల్ గెలవడం ఖాయం అని అనుకున్నారు అందరు. ఈ క్రమంలోనే టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టు ఇక ఇటీవల  వరుసగా ఓటమి చవి చూడటం తో చివరికి ప్లే ఆఫ్ కి చేరుకోవడం ఎంతో కష్టంగా మారిపోయింది.  ఇక ముంబై ఇండియన్స్ కి నెట్ రన్ రేట్ కూడా చాలా తక్కువగా ఉండడంతో ప్లే ఆఫ్ చేరే అవకాశాలు దాదాపు అయిపోయాయి. అయితే హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ప్లే ఆఫ్ అవకాశాలను పూర్తిగా వదిలేసింది ముంబై ఇండియన్స్ జట్టు.


 గత రెండు సీజన్లలో టైటిల్ కొట్టి ఇక ఇప్పుడు హ్యాట్రిక్ కూడా సాధిస్తుంది అనుకున్న అభిమానులకు ముంబై ఇండియన్స్  ఇంటి బాట పట్టడంతో నిరాశే మిగిలింది అనే చెప్పాలి  అయితే సన్రైజర్స్ హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్లో 42 పరుగుల తేడాతో విజయం సాధించినప్పటికీ నెట్ రన్ రేట్ తక్కువగా ఉండటం కారణంగా ముంబై ప్లే ఆఫ్ అవకాశాలను దక్కించుకోలేకపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ జట్టు 9 వికెట్ల నష్టానికి 235పరుగులు సాధించింది. తర్వాత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 193 పరుగులకే పరిమితం అయింది.



 ఇక మ్యాచ్ విజయం సాధించిన అనంతరం ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు  ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన తమ జట్టు ఈసారి ప్లే ఆఫ్ కూడా చేరకపోవడం కాస్త నిరాశకు గురిచేసింది అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ. అయితే గత ఆరేళ్లలో ఏకంగా నాలుగు సార్లు విజేతగా నిలవడం మాత్రం గర్వంగా ఉంది అంటూ తెలిపాడు. ఇక చివరి మ్యాచ్ లో అద్భుతమైన విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. అభిమానులు మాకు ఎప్పుడు మద్దతు ఇస్తూనే ఉన్నారు. ప్లే ఆప్ కి అర్హత సాధించకపోవడంతో ఎంతగానో నిరాశ చెంది ఉన్నాం. ముంబై లాంటి జుట్టు ఆడుతున్నప్పుడు ఎట్టిపరిస్థితుల్లో మైదానంలో మంచి ప్రదర్శన చేస్తారు అని అటు ప్రేక్షకులు కూడా ఆశిస్తూ ఉంటారు అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl