సాధారణంగా ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగుతున్న ఆటగాళ్లు వరసగా మ్యాచ్లు ఆడుతూ  ఉండటం చూస్తూ ఉంటాం. ఇలా వరసగా మ్యాచ్ లు ఆడుతూ క్రికెట్ ప్రేక్షకులు అందరినీ అలరిస్తూ ఉంటారు. కానీ అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో ఏళ్ల పాటు సేవలందించి ఇక ఆ తర్వాత వయసు పైబడటం తో క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఆటగాళ్లు దాదాపు క్రికెట్కు పూర్తిగా దూరమై పోతారు అనే చెప్పాలి. క్రికెట్లో ఎన్నో ఏళ్ల పాటు సేవలందించిన క్రికెట్ లెజెండ్ మళ్లీ ఒకసారి మైదానంలోకి దిగి క్రికెట్ ఆడితే చూడాలని ఎంతో మంది ప్రేక్షకులు ఆశ పడుతూ ఉంటారు. ఒకప్పుడు అయితే ఇలాంటి అవకాశం ఉండక పోయేది కానీ ఇప్పుడు మాత్రం ఐసీసీ లెజెండ్స్ అందరిని కూడా మైదానంలోకి రప్పించి ప్రేక్షకులందరికీ కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందిస్తూ మళ్లీ పాత రోజులను గుర్తుచేయడానికి సిద్ధమైంది.



 ఈ క్రమంలోనే ప్రస్తుతం మాజీ ఆటగాళ్లు అందరితో కలిసి లెజెండ్స్ లీగ్ క్రికెట్ టి20 టోర్నమెంట్ నిర్వహిస్తూ వస్తుంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఈ 20 టోర్నమెంట్ లో అటు అన్ని దేశాలకు సంబంధించిన సీనియర్ మాజీ ఆటగాళ్లు అందరు కూడా మళ్లీ మైదానంలోకి దిగి ఒకప్పటిలా హోరాహోరీగా మైదానంలో పోటీపడతారు.  ఈ క్రమంలోనే భారత క్రికెట్ నుంచి కూడా ప్రస్తుతం లెజెండ్స్ గా కొనసాగుతున్న ఎంతోమంది బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. జనవరి 20 వ తేదీ నుంచి 27 వరకూ ఒమన్ వేదికగా లెజెండ్స్ లీగ్ క్రికెట్ టి20 టోర్నమెంట్ జరగబోతుంది. అయితే ఇక ఈ సారి అందరూ మాజీ క్రికెటర్లు బరిలోకి దిగబోతున్నారాని భారత క్రికెట్ ప్రేక్షకులందరూ ఆతృతగా ఎదురుచూస్తున్న సమయంలో సచిన్ టెండూల్కర్ షాక్ ఇచ్చాడు.



 కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య లెజెండ్స్ లీగ్ క్రికెట్ టి20 టోర్నమెంట్ నుంచి తాను తప్పు కుంటున్నాను అంటూ ప్రకటించాడు సచిన్ టెండూల్కర్. దీంతో అందరూ షాక్ అయ్యారు. అయితే ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ ఇండియన్ మహారాజా టీం కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. ఇక ఇటీవల తాను లీగ్ నుంచి తప్పుకుంటున్న అంటూ ప్రకటించడంతో ప్రస్తుతం మహారాజ్ టీం కి కొత్త కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ జట్టుకు వైస్ కెప్టెన్గా మొహమ్మద్ కైఫ్ వ్యవహరించ బోతున్నాడు. ఇక వీరేంద్ర సెహ్వాగ్ కెప్టెన్సీలోని అటు లెజెండ్ జట్టు ఎలా రాణించ బోతుంది  అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: