కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం గుజరాత్ టైటాన్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ ఇంగ్లాండ్ ప్లేయర్ జాసన్ రాయ్ ఈ ఐపిఎల్ సీజన్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇతనిని గుజరాత్ వేలంలో 2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఇప్పుడు రాయ్ ఈ సీజన్ ఆడడం లేదని ప్రకటించడంతో గుజరాత్ జట్టు ఆలోచనలో పడింది. అయితే రాయ్ ఎక్కువ రోజులు బయో బబుల్ లో ఉండలేక ఈ నిర్ణయం తీసుకున్నాడట... అంతే కాకుండా జనవరిలో తన భార్య రెండవ సారి శిశువుకు జన్మను ఇచ్చింది. అందుకే తన భార్య మరియు బిడ్డలతో సంతోషంగా గడపడానికి అధికారికంగా తెలియచేశాడు.
రాయ్ ఇలా చేయడం ఇది మొదటిసారి కాదట... గతంలో 2020 సీజన్ సమయంలో ఢిల్లీ జట్టులో ఉండగా ఆడకుండా డుమ్మా కొట్టాడు. కాగా ఇప్పుడు హార్దిక్ పాండ్యకు షాక్ అని చెప్పాలి. మరి ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ ఎలాంటి స్టెప్ తీసుకోనుంది అన్న విషయం తెలియాలంటే కొంత సమయం వేచి చూడక తప్పదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి