ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో కోల్కతా నైట్రైడర్స్ జట్టు అద్భుతంగా రాణిస్తోంది అనుకుంటే పడుతూ లేస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎట్టి పరిస్థితుల్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టు తర్వాత మ్యాచ్లు అన్నింటిలో కూడా విజయం సాధించాల్సి ఉన్న నేపథ్యంలో ఇటీవలే జట్టుకు ఊహించని షాక్ తగిలింది. జట్టులో స్టార్ బౌలర్ గా కొనసాగుతున్న పాట్ కమ్మిన్స్ ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. తుంటి ఎముక గాయం కారణం గా పాట్ కమ్మిన్స్ ఇక మెగా టోర్ని  వీడనూన్నట్లు సమాచారం.


 ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ఇటీవలే ఒక ప్రకటన లో తెలిపింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ వచ్చే నెల లో శ్రీలంక పర్యటన కారణం గా పాట్ కమ్మిన్స్ ఐపీఎల్  నుండి స్వదేశానికి వెళ్ళాడు అని తెలుస్తుంది. అక్కడ సిడ్నీలోని రిహబిలెషన్ సెంటర్ కు చేరుకున్నాడు. లంక జట్టు సిరీస్ నేపథ్యంలో ఫిట్నెస్ సాధించి వన్డే టెస్ట్ మ్యాచ్ సిరీస్లకు సిద్ధం కావాలని పాట్ కమ్మిన్స్ భావించాడు అని చెప్పాలి. ఇదిలా ఉంటే అటు లంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా సిరీస్ లు జరగడంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పాలి.


 ఈ క్రమం లోనే లంక వేదికగా కాకుండా దుబాయ్ వేదికగా ఈ సిరీస్ లు నిర్వహించాలని లంక క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న పాట్ కమ్మిన్స్..  ఈ ఏడాది మాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు అని చెప్పాలి. ఇక ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో 15 బంతుల్లో 56 పరుగులు సాధించి ఐపీఎల్లో ఫాస్టెస్ట్ 50 తన ఖాతాలో వేసుకున్నాడు.  ఇప్పటివరకూ 5 మ్యాచ్లు ఆడిన పాట్ కమ్మిన్స్ 63 పరుగులతో పాటు బౌలింగ్లో 7 వికెట్లు తీశాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl