పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం ఎన్నో రోజుల నుంచి అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ప్రతి మ్యాచ్ లో కూడా మెరుగైన ప్రదర్శన కనబరుస్తూ రికార్డులను కొల్లగొడుతున్నాడు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా పరుగుల వరద పారించాడు  అని చెప్పాలి. ఇలా ప్రతి మ్యాచ్ లో బ్యాట్ ఝాలిపిస్తూ ఎన్నో రికార్డులను ఇప్పటికే బ్రేక్ చేశాడు. అయితే పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజాం కి తోడు అటు మరో బ్యాట్స్మన్ ఇమాముల్ హాక్ కూడా ప్రస్తుతం కెరీర్ లోనే అత్యుత్తమ ఫామ్ లో కొనసాగుతున్నాడు.



 ఈ క్రమంలోనే ఈ ఇద్దరు బ్యాట్స్మెన్లు  ఒక్కసారి బరిలోకి దిగారు అంటే చాలీ చేస్తే అర్ద సెంచరీ లేదంటే సెంచరీ అన్నట్టుగా వీరి భీకరమైన ఫామ్ కొనసాగుతూ ఉంది అని చెప్పాలి.  ఇక వీరిద్దరి అద్భుతమైన ఇన్నింగ్స్ పాకిస్తాన్ జట్టుకి ఎన్నో అరుదైన విజయాలను కూడా అందిస్తూ ఉన్నాయి. ఇకపోతే ఇటీవలే వన్డే క్రికెట్ చరిత్రలోనే పాకిస్థాన్ బ్యాట్స్మెన్లు బాబర్ అజాం ఇమామ్ ఉల్ హక్  అరుదైన ఫీట్ సాధించటం గమనార్హం.  ఇటీవల వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో భాగంగా ఈ ఇద్దరు కూడా అర్ధ సెంచరీలతో మెరిశారు. కాగా ఈ ఇద్దరికీ వరుసగా ఇది ఆరవ సెంచరీ కావడం గమనార్హం.


 దీంతో అరుదైన ఘనత ఈ పాకిస్థాన్ బ్యాట్స్మెన్ల ఖాతాలో వచ్చి చేరిపోయింది. వన్డే క్రికెట్ చరిత్రలో ఇలా ఒకేసారి ఇద్దరు పాకిస్తాన్ బ్యాట్స్మెన్లు వరుసగా సమాన అర్ధ శతకాలు నమోదు చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. మరికొన్ని రోజుల్లో ప్రపంచ కప్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ బ్యాట్స్మెన్ ల భీకరమైన ఫామ్ ప్రత్యర్థి జట్లను కాస్త కలవర పెడుతోంది అనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఇద్దరు పాకిస్తాన్ బ్యాట్స్మెన్లు ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టి20 వరల్డ్ కప్ లో ఎలా రాణిస్తారో అని అటు పాకిస్థాన్ అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: