సాధారణంగా క్రికెటర్లకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెటర్లకు సంబంధించిన ఏదైనా ఈ వార్త సోషల్ మీడియాలో కి వచ్చింది అంటే చాలు అది కేవలం క్షణాల వ్యవధిలోనే వైరల్ గా మారిపోతూ ఉంటుంది.  అయితే సాధారణంగా క్రికెటర్లు సినీ సెలబ్రిటీలతో ప్రేమలో మునిగి తేలడం లాంటి ఘటనలు ఇప్పటివరకు ఎన్నో సార్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఇలాంటి లవ్ స్టోరీ లు  ఎక్కువగా తెరమీదికి వస్తూ ఉంటాయి అని చెప్పాలి. క్రికెటర్లు ఎక్కువగా వివిధ రంగాలకు చెందిన వారిని ప్రేమించడం తర్వాత పెళ్లి చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.


కానీ క్రికెటర్లు క్రికెటర్లను పెళ్లి చేసుకోవడం మాత్రం చాలా అరుదుగా మాత్రమే జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక్కడ ఒక స్టార్ క్రికెటర్ ఇలాంటిదే చేయబోతోంది. క్రికెటర్ తో ప్రేమలో మునిగితేలిన టీమిండియా స్టార్ క్రికెటర్ ఇక ఇప్పుడు పెళ్లికి కూడా సిద్ధమైంది అని తెలుస్తుంది.  ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరో క్రికెటర్ నీ ప్రేమ వివాహం చేసుకోబోతున్న స్టార్ క్రికెటర్ ఎవరో కాదు టీమ్ ఇండియా ఉమెన్స్ టీం స్టార్ ప్లేయర్ వేద కృష్ణమూర్తి. ఈమె కర్ణాటక క్రికెట్ అర్జున్ హోయసల తో ప్రేమ లో ఉంది.



 ఇక మరికొన్ని రోజుల్లో వీరి ప్రేమకు ప్రమోషన్ ఇవ్వడానికి సిద్ధమైంది ఈ జంట. ఈ క్రమంలోనే లవ్ మ్యారేజ్ తో  ఒకటి కాబోతున్నారు. ఈ విషయాన్ని ఇటీవలే కర్ణాటక క్రికెటర్ అర్జున్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ప్రకటించాడు అనే చెప్పాలి. వేద కృష్ణమూర్తికి ఎంగేజ్మెంట్ రింగ్ తో ప్రపోజ్ చేయగా.. ఆమె పెళ్లికి ఒప్పుకుంది అంటూ అర్జున్ తెలిపాడు.  వేద కృష్ణమూర్తి ఇప్పుడు వరకు టీమిండియా తరఫున 48 వన్డే మ్యాచ్ లతోపాటు 76 టి20 మ్యాచ్ ఆడింది. మరోవైపు అర్జున్ తన లోని ప్రతిభను నిరూపించుకునీ ఇక భారత జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: