
క్రిస్టియానో రోనాల్డో బరిలోకి దిగాడు అంటే చాలు ఏకంగా ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. తన అద్భుతమైన ప్రతిభతో ప్రత్యర్ధులను తికమక అద్భుతమైన గోల్స్ సాధిస్తూ ఉంటాడు ఈ స్టార్ ప్లేయర్. ఇక ఈ ఫుట్బాల్ ప్లేయర్ కి అటు భారత్ లో కూడా కోట్ల మంది అభిమానులు ఉన్నారు అని చెప్పాలి.. ఇకపోతే ప్రస్తుతం అందరూ ఫిఫా వరల్డ్ కప్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా ఏ జట్టు ఛాంపియంగా అవతరిస్తుంది అన్నదానిపై కూడా అంచనాలు వేస్తున్నారు.
అదే సమయంలో ఆయా జట్ల ఆటగాళ్లు కూడా ఇక తమ జట్టు తప్పకుండా వరల్డ్ కప్ విజేతగా నిలుస్తుంది అన్న విషయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల పోర్చుగల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫిఫా వరల్డ్ కప్ లో పోర్చుగల్ జట్టు ఛాంపియంగా అవతరిస్తే తాను తన కెరీర్ కి రిటైర్మెంట్ ప్రకటిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇటీవల బ్రిటీష్ జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా సరదాగా మాట్లాడాడు.. క్రిస్టియన్ రోనాల్డో 1992 లో ఫుట్బాల్ కెరియర్ మొదలుపెట్టాడు. ప్రస్తుతం పోర్చుగల్ జాతీయ ఫుట్బాల్ జట్టు కెప్టెన్ గా ఉన్నాడు. 800 కు పైగా గోల్స్ చేశాడు అని చెప్పాలి. రోనాల్డో నాలుగు సార్లు గోల్డెన్ బూట్ అవార్డును కూడా అందుకోవడం గమనార్హం.