కానీ ఊహించని రీతిలో అందరి అంచనాలు తారుమారు అయ్యాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే గాయం కారణంగా రెండవ టి20 మ్యాచ్ కి అటు సంజు శాంసన్ దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. అయితే శ్రీలంకతో జరిగిన తొలి టీ20 లో కేవలం ఐదు పరుగులు మాత్రమే చేశాడు. రెండో మ్యాచ్లో అయినా అదరగొడతాడు అనుకుంటే చివరికి గాయం కావడంతో ఇక రెండో టి20 మ్యాచ్ కి అతను అందుబాటులో లేకుండా పోయాడు అన్న విషయం తెలిసిందే. దీంతో అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు.
గాయం తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వైద్యుల సూచన మేరకే మిగతా రెండు టీ20ల నుంచి కూడా అటు బీసీసీఐ సంజూని తప్పించినట్లు తెలిపింది కాగా స్థానంలో విదర్భ వికెట్ కీపర్ అయినా జితేష్ శర్మను టీమిండియాలోకి తీసుకున్నారు అయితే తన గాయం పై ఇటీవల సంజు శాంసన్ స్పందించాడు. అంతా బాగానే ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. త్వరలోనే మళ్లీ మైదానంలోకి దిగుతానంటూ పోస్ట్ పెట్టాడు. వెంటనే స్పందించిన శిఖర్ దావన్ నువ్వు త్వరగా కోలుకోవాలని బ్రో అంటూ కామెంట్ చేయడం గమనార్హం. అభిమానులు కూడా అతని తొందరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి