
ఈ క్రమంలోనే తన అద్భుతమైన బౌలింగ్ తో ఇప్పటికే ఎన్నో ప్రపంచ రికార్డులు కొల్లగొట్టిన చాహల్ ఇంకా రికార్డుల వేట కొనసాగిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం టీమిండియాలో కీలక బౌలర్గా కొనసాగుతూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం న్యూజిలాండ్తో జరుగుతున్న టి20 సిరీస్ లో భాగంగా తన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న చాహల్ ఇక ఇటీవల ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి. భారత స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ రికార్డును బద్దలు కొట్టాడు.
అంతర్జాతీయ క్రికెట్ లో టి20 ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా రికార్డు సృష్టించాడు చాహల్. ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన రెండవ టి20 మ్యాచ్ లో భాగంగా ఒక వికెట్ తీశాడు అని చెప్పాలి. తద్వారా ఈ రికార్డును సాధించాడు. 75 మ్యాచ్ లలో 91 వికెట్లు తీశాడు. ఇక అంతకుముందు భువనేశ్వర్ కుమార్ 90 వికెట్లతో ఇక టి20 ఫార్మాట్లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఉండగా.. ఇక ఇప్పుడు ఆ రికార్డును అధిగమించాడు చాహల్. ఇక అంతర్జాతీయ టి20 లలో అత్యధిక వికెట్లు తీసిన వారిలో సౌదీ 134, షాకీబ్ ఉల్ హసన్ 128, రషీద్ ఖాన్ 124 వికెట్లతో వరుసగా మూడు స్థానాల్లో ఉన్నారు.