రేపటి నుంచి భారత జట్టు ప్రతిష్టాత్మకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడబోతుంది అన్న తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ టెస్ట్ సిరీస్ కోసం ఇప్పటికే ఆస్ట్రేలియ జట్టు భారత గడ్డపై అడుగు పెట్టింది. ఇక ప్రాక్టీస్ లో మునిగితేలుతూ ఉంది. అదే సమయంలో ఇప్పటికే భారత జట్టు సొంత గడ్డపై ఎంతో పటిష్టంగా కనిపిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరగబోతుంది అన్నది తెలుస్తుంది. అయితే గత మూడు సీజన్స్ నుంచి కూడా ఆస్ట్రేలియాపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న భారత జట్టు వరుసగా సిరీస్ సొంతం చేసుకుంటుంది అని చెప్పాలి.


 అయితే ఇప్పుడు భారత్ వేదికగా జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో విజయం సాధించి మరోసారి భారత జట్టును సొంత గడ్డపైనే ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని ఆస్ట్రేలియా భావిస్తుంది. ఈ టెస్ట్ సిరీస్ హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇలాంటి సమయంలో అటు భారత క్రికెట్ ప్రేక్షకులు ఇక భారత జట్టుకు గతంలో చారిత్రాత్మక టెస్టు సిరీస్ ను అందించిన ఒక హీరోని గుర్తు చేసుకుంటున్నారు. 2020-21లో ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఎవ్వరూ మరిచిపోలేరు. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ లీవ్ లో ఉన్న నేపథ్యంలో ఇక వైస్ కెప్టెన్ అజింక్యా రహానే జట్టు సారధ్య బాధ్యతలను అందుకున్నాడు.


 జట్టులో కేవలం యువ ఆటగాళ్లు మాత్రమే ఉన్న నేపథ్యంలో.. అప్పటికే మొదటి మ్యాచ్ ఓడిపోయిన టీమ్ ఇండియా సిరీస్ చేజార్చుకోవడం ఖాయం అని అందరూ అనుకున్నారు. కానీ తర్వాత రెండో మ్యాచ్ లో భారత్ గెలవడం ఇక సిడ్ని వేదికగా జరిగిన మూడో మ్యాచ్లో భారత యువ ఆటగాల అద్భుతంగా రానించి మ్యాచ్ డ్రా చేయడం.. ఇక గబ్బ వేదికగా జరిగిన టెస్టులో చారిత్రాత్మక విజయాన్ని సాధించడంతో 2-1 తేడాతో భారత జట్టు సిరీస్ కైవసం చేసుకుంది. అప్పుడు అజింక్య రహనేపై అందరూ ప్రశంసలు కురిపించారు. అతను ఇంకా ఎన్నో ఏళ్ల పాటు భారత జట్టులో ఉంటాడని అనుకున్నారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకప్పుడు సిరీస్ గెలిపించి హీరో అయినా రహనేకు .. ఇక ఇప్పుడు ఇప్పుడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో  కనీసం చోటు దక్కించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఫామ్ కోల్పోయి రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు అని చెప్పాలి. దీంతో అతన్ని గుర్తుచేసుకుంటూ రెండు ఏళ్ల క్రితం నువ్వే హీరో.. కానీ ఇప్పుడు ఏమైపోయావు అంటూ కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: