
అయితే ఇక మంచి ప్రదర్శన చేస్తూ ఇంగ్లాండుకు ప్రమాదకరంగా మారిపోతున్న టామ్ లాథం ను సైతం జోరూట్ ఎల్ బి డబ్ల్యూ చేశాడు అని చెప్పాలి. ఇక వీరిద్దరూ తమ మెరుగైన బౌలింగ్ తో ఏకంగా న్యూజిలాండ్ ఓపెనర్లను అవుట్ చేయడంతో కివీస్ కష్టాల్లో కూరుకుపోయింది అని చెప్పాలి. ఇక ఆ తర్వాత విల్ యంగ్ రూపంలో జాక్ లీచ్ కి రెండో వికెట్ కూడా దక్కింది అని చెప్పాలి. ఇకపోతే విల్ యంగ్ ను జాక్ లీచ్ తన స్పిన్ మాయాజాలంతో అవుట్ చేసిన తీరు మాత్రం ఇన్నింగ్స్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది.
62 ఓవర్ లో ఇక ఇలా తన స్పిన్ మాయాజాలం చూపించాడు జాక్ లీచ్. నాలుగో బంతిని ఆఫ్ స్టంప్ దిశగా వేశాడు. అయితే బంతిని అంచనా వేయలేకపోయాడు న్యూజిలాండ్ బ్యాటర్ విల్ యంగ్. ముందుకు రావాలో లేదంటే క్రీజులో ఉండి డిఫెన్స్ చేయాలో అతనికి అర్థం కాలేదు. అయితే ఏదో ఒకటి చేయాలి కాబట్టి బ్యాట్ తో డిఫెన్డ్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే అంతలోపే బంతి అద్భుతమైన స్పిన్ తీసుకొని ఆఫ్ సైడ్ స్టంపును ఎగరగొట్టడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే బౌల్డ్ అయిన తర్వాత విల్ యంగ్ ఒక్కసారిగా అవ్వక్కయ్యాడు. ఇది ఎలా సాధ్యమైందో అతనికి అర్థం కాలేదు. ఇక 8 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నిరాశగా అతను పెవిలియన్ చేరాడు అని చెప్పాలి.