ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి 83 ఏళ్ల ఒక వృద్ధుడు గురించే. సాధారణంగా 83 ఏళ్ళు వస్తే మీరు ఏం చేస్తారు అని అడిగితే ఆ వయసులో ఇంకేం చేస్తాం.. హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ.. మనవళ్ళు మనవరాల్లాతో ఆడుకుంటూ కృష్ణ రామ అనుకుంటూ శేష జీవితాన్ని గడిపేస్తాం అని చెబుతూ ఉంటారు అందరూ. కానీ ఇక్కడ 83 ఏళ్ల వృద్ధుడు మాత్రం ఆ వయసులో కూడా తగ్గేదేలే అంటున్నాడు. యాక్టివ్గా క్రికెట్ ఆడుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాడు. అతని ఆరోగ్యం బాగా లేకపోయినా ఆక్సిజన్ సిలిండర్ సాయంతో క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది.
40 లేదా 45 ఏళ్ల వయసు వస్తేనే కోచ్ గానో లేదంటే విశ్లేషకుడు గానో జీవితాన్ని ప్రారంభిస్తున్నారు ఎంతోమంది. కానీ స్కాట్లాండ్ మాజీ క్రికెటర్ అలెక్స్ స్టీల్ మాత్రం 83 ఏళ్ల వయసులోనూ క్లబ్ క్రికెట్ ఆడుతున్నాడు. ఏకంగా ఆటపై అతనికి ఉన్న అంకితభావంతో చివరికి అనారోగ్యానికి కూడా లెక్క చేయకుండా మైదానంలో బ్యాట్ పట్టుకుని బరిలోకి దిగుతున్నాడు. అలెక్స్ స్టీల్ 2020 నుంచి ఇడియో పతిక్ పల్మనేరి ఫైబ్రోసిస్ అని ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే క్రికెట్ మీద ఉన్న మక్కువతో ఆక్సిజన్ సిలిండర్ భుజానికి తగలేసుకొని టిఫిన్ చేస్తూ ఉన్నాడు. ఈ వీడియో చూసిన నెటిజెన్స్ షాక్ అవుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి