భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు క్రికెట్ ప్రపంచం మొత్తం కాస్త కళ్ళు పెద్దవి చేసి మరి వీక్షిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. కాగా ఆసియా కప్ లో భాగంగా ఈ మ్యాచ్ సెప్టెంబర్ 2వ తేదీన జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక మ్యాచ్ ప్రారంభం కి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అటు మాటలు యుద్ధం కూడా ప్రారంభమైంది. ఇప్పటికే అటు పాకిస్తాన్ ఇండియా ఇక ఆసియా కప్ కోసం జట్ల వివరాలను ప్రకటించాయి అని చెప్పాలి.


 అయితే ఇటీవలే మీడియా సమావేశంలో పాల్గొన్న భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ను సెప్టెంబర్ రెండవ తేదీన పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్లో పాకిస్తాన్ బౌలింగ్ దళాని ఎలా ఎదుర్కొంటారు అంటూ మీడియా మిత్రులు ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఇదే విషయంపై బిసిసిఐ చీఫ్ సెలెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పాకిస్తాన్ బౌలర్ల పని విరాట్ కోహ్లీ చూసుకుంటాడు అంటూ కామెంట్ చేశాడు. ఎందుకంటే 2022 t20 ప్రపంచ కప్ లో కోహ్లీ పాకిస్తాన్ బౌలర్లకు విశ్వరూపం చూపించాడు.  8 బంతుల్లో భారత విజయానికి 28 పరుగులు అవసరమైన సమయంలో రెండు భారీ సిక్సర్లు కొట్టి.. ఏకంగా భారత విజయవకాశాలను సులభతరం చేసి జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు.


 ఈ క్రమంలోనే అజిత్ అగర్కర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. అయితే ఇక అగర్కర్ కామెంట్లపై పాకిస్తాన్ ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్ కౌంటర్ ఇచ్చాడు. చూడండి నేను లేదా ఇంకొకరూ కావచ్చు లేదా అవతలి వైపు వాళ్లు కూడా కావచ్చు. ఎవరికి అనిపించింది వారు ఏదైనా మాట్లాడుతారు. దాని వల్ల ఒరిగేదేమీ లేదు. కానీ మైదానంలో దిగాక ఆ రోజు ఏమి జరుగుతుందన్నది ముఖ్యం.. దానిపైనే ఫలితం కూడా ఆధారపడి ఉంటుంది. మ్యాచ్ జరుగుతున్నప్పుడే కదా అసలేం జరుగుతుందో తెలిసేది అంటూ షాదాబ్ ఖాన్ కామెంట్లు చేశాడు. దీంతో అగర్కర్ కు షాదాబ్ ఖాన్ కౌంటర్ ఇచ్చాడు అంటూ అందరూ చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: