భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ టోర్ని ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం సెమీఫైనల్ పోరు జరుగుతుంది. ఇక ఈ సెమీఫైనల్ లో భాగంగా ఇటీవల న్యూజిలాండ్, భారత్ మ్యాచ్ మధ్య జరిగింది. అయితే ఈ రెండు టీమ్స్ మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగిన కూడా ఉత్కంఠ మరో రేంజ్ లో ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు అత్యుత్తమ ప్రదర్శన చేసే టీమ్ ఇండియాకు కఠినమైన సవాలు విసిరే జట్టు ఏదైనా ఉంది అంటే.. అది కేవలం న్యూజిలాండ్ మాత్రమే అని చెప్పాలి. 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్ లోను భారత్ ను ఓడించి ఇంటికి పంపించింది కివిస్ టీం.


 ఇక ఇప్పుడు మరోసారి వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టు న్యూజిలాండ్ తో తలబడాల్సి రావడంతో.. ఇక యావత్ భారత్ మొత్తం కాస్త టెన్షన్ లో మునిగిపోయింది అని చెప్పాలి. అయితే ఇటీవల న్యూజిలాండ్, ఇండియా మధ్య జరిగిన మ్యాచ్ లో హోరాహోరీ పోరులో భారత జట్టు ఘన విజయాన్ని అందుకుంది  అయితే మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 397 పరుగులు చేసింది. ఇక భారీ స్కోర్ ఉండడంతో న్యూజిలాండ్ ఓటమి ఖాయం అని అందరూ అనుకున్నారు. మొదట్లోనే రెండు వికెట్లు పడటంతో ఎంతో ఈజీగా టీమిండియా  విజయం సాధిస్తుందని భావించారు. కానీ ఆ తర్వాత ఆ జట్టు బ్యాట్స్మెన్లు క్రీజ్ లో పాతుకుపోయి పరుగులు సాధిస్తూ ఉంటే అందరిలో మళ్లీ టెన్షన్ మొదలైంది.


 ఇలాంటి సమయంలోనే మహమ్మద్ షమి తన బౌలింగ్ తో  అద్భుతం చేశాడు. ఏకంగా ఈ మ్యాచ్ లో 7 వికెట్లు తీసి సత్తా చాటాడు అని చెప్పాలి. దీంతో ఇక న్యూజిలాండ్ కి ఓటమి తప్పలేదు. అయితే ఈ ఓటమి గురించి స్పందించిన కేన్ విలియమ్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముందుగా టీమిండియా కు అభినందనలు. వారు ఈరోజు తమ అత్యుత్తమ ప్రదర్శన చేశారు  భారత్ టాప్ క్లాస్ జట్టు. ఇండియాలో ఆడటం ప్రత్యేకంగా భావిస్తున్నాం. మాకు ఆతిథ్యం ఇచ్చినందుకు థాంక్స్. మేము నాకౌట్ లో నిష్క్రమించడం నిరాశపరిచింది అంటూ కెన్ విలియమ్సన్ అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: