అయితే ప్రస్తుతం వరల్డ్ కప్ ఫైనల్ నేపథ్యంలో ఇక ఎవరు ఏం చెప్పినా కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది. అయితే ఈ మెగా టోర్నీ బిగ్ ఫైట్ లో విజేత ఎవరు అని ప్రముఖ జ్యోతిష్యుడు పండిట్ జగన్నాథ్ గురూజీ అంచనా వేశారు. రెండువైపులా జాతకాలను పోల్చి చూస్తే ఆస్ట్రేలియాపై భారత్ దే పైచేయిగా ఉంటుందని చెప్పుకొచ్చారు ఐసీసీ ప్రపంచ కప్ 2023 ట్రోఫీని అన్ని విధాలుగా భారత్ కైవసం చేసుకుంటుంది అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జాతకం కంటే టీమిండియా.. జాతకమే ఎంతో మెరుగ్గా బలంగా ఉంది అంటూ తెలిపారు ఆయన.
అంతేకాకుండా ఆటగాళ్లకు ఇది ఉత్సాహం.. చిత్తశుద్ధి చిత్తశుద్ధి అంకిత భావాన్ని అందిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు ఆయన సోషల్ మీడియా వేదికగా ఇందుకు సంబంధించిన పోస్ట్ పెట్టారు ఇక రోహిత్ శర్మ జాతకం గురించి చెబుతూ.. రోహిత్ గ్రహస్థానాలు అమరికలు.. 2011 ప్రపంచకప్ లో మహేంద్రసింగ్ ధోనికి పోలి ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు. అతను ప్రపంచ కప్ లో ట్రోఫీని ఎత్తి చరిత్ర సృష్టిస్తాడని జోష్యం చెప్పారు పండిత్ జగన్నాథ్ గురూజీ. ఇక ఆయన మాటలతో ప్రస్తుతం టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి