రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్న తర్వాత భారత జట్టు ఎంత విజయవంతమైన ప్రస్థానం కొనసాగిస్తున్నదో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. మూడు ఫార్మాట్లలో కూడా అదరగొడుతుంది టీమిండియా. ఈ క్రమంలోనే తమ అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తుంది అని చెప్పాలి. అయితే ఇక టెస్ట్ ఫార్మాట్లోనూ మునుపేన్నడు లేని విధంగా విజయాలను సాధిస్తూ వస్తుంది.


 ఇలాంటి విజయాలను సాధిస్తుంది కాబట్టే గత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పోరులో ఏకంగా ఫైనల్ వరకు చేరుకుంది టీమిండియా. అయితే తప్పకుండా వరులు టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో గెలుస్తుందని అనుకున్నప్పటికీ ఊహించని రీతిలో అటు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి నిరాశతో ఇంటి బాట పట్టింది భారత జట్టు. అయితే ఓడిన మళ్లీ గెలుపు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది.  2023- 25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల ఐసీసీ ప్రకటించిన పాయింట్స్ టేబుల్ లో టీమిండియా మూడో స్థానానికి చేరుకుంది.



 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 - 25 పాయింట్స్ టేబుల్ లో ప్రస్తుతం 66.67 విన్నింగ్ పర్సంటేజ్ తో మూడో స్థానంలో నిలిచింది టీమిండియా.  అయితే పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు 100% విన్నింగ్ పర్సంటేజ్ తో తొలి రెండు స్థానాలలో ఉన్నాయి అని చెప్పాలి. ఇక భారత్ తర్వాత స్థానాలలో ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్, ఇంగ్లాండ్, శ్రీలంక, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా కొనసాగుతున్నాయ్ అని చెప్పాలి. ఇక ఇటీవల జరిగిన టెస్ట్ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టుపై విజయం సాధించడంతో బంగ్లాదేశ్ ఇలా రెండవ స్థానానికి ఏగబాకింది అని చెప్పాలి. కాగా భారత జట్టు సౌత్ఆఫ్రికా పర్యటనలో టెస్టులు ఆడబోతుంది. ఈ క్రమంలోనే  ఆ టెస్ట్ మ్యాచ్లో గెలిస్తే టీమిండియా ర్యాంకు మెరుగుపడే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: