
అయితే ఇలా ఎన్ని పార్టీల నుంచి అభ్యర్థులు బరిలోకి దిగిన.. ఇక ఇండిపెండెంట్గా పోటీ చేసినా.. ఎవరికి ఓటు వేయాలి అనే తుది నిర్ణయం మాత్రం ఓటర్ల చేతిలోనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఎన్నికల పోలింగ్ సమయంలో ఓటర్లు తమ తీర్పును వెలువరిస్తూ ఉంటారు. ఒకవేళ పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు లేదంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న అభ్యర్థులు నచ్చకపోతే ఓటర్లు ఇక నోటా ద్వారా తమ వ్యతిరేకతను తమ అసంతృప్తిని వ్యక్తపరిచేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఏ ఎన్నికల్లో చూసిన అభ్యర్థులకు వచ్చిన ఓట్లు పోల్చి చూస్తే నోటా కి అతి తక్కువ ఓట్లు వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం పదిమంది అభ్యర్థుల కంటే నోటాకే ఎక్కువ ఓట్లు రావడం గమనార్హం.
ఖేడ్ ఎన్నికల ఫలితాల్లో 10 మంది అభ్యర్థులకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. నోటా కి 858 ఓట్లు రాగా.. వివిధ పార్టీలు ఇండిపెండెంట్గా పోటీ చేసిన పదిమంది అభ్యర్థులకు ఇక 858 కంటే తక్కువ ఓట్లు రావడం గమనార్హం. జీవన్ 136, అంకుష్కు 126, బి.ఎం.పి అభ్యర్థి ప్రకాష్ రాథోడ్ కు 648, నరసింహులుకు 340, రమేష్ నాయక్ 148, గోపాల్ రెడ్డికి 574, అంజా గౌడ్ కు 400, నర్సారెడ్డికి 154, వెంకటేశ్వరరావుకి 381, అశోక్ గౌడ్ కి 773 ఓట్లు వచ్చాయి. ఇలా ఈ పది మంది అభ్యర్థులు కూడా నోటా కంటే తక్కువ ఓట్లను దక్కించుకోవడం గమనార్హం.