టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక సాదాసీదా రైల్వే టికెట్ కలెక్టర్ స్థాయి నుంచి ఏకంగా దేశం గర్వించదగ్గ క్రికెటర్ స్థాయికి ఎదిగిన ధోని ప్రస్థానం.. ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయకం అని చెప్పాలి. అయితే భారత జట్టుకు అందని ద్రాక్షలో ఉన్న వరల్డ్ కప్ ను రెండుసార్లు అందించిన ధోని ఇక భారత క్రికెట్ అనే పుస్తకంలో తనకంటూ ప్రత్యేకమైన పేజీలు లికించుకున్నాడు. అయితే ధోనిని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటికీ కూడా ఎంతోమంది యువ ఆటగాళ్లు క్రికెట్ నే ప్యాషన్ గా మార్చుకుని ముందుకు సాగుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే జార్ఖండ్ రాష్ట్రం నుంచి భారత జాతీయ జట్టులోకి వచ్చి ఈ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది కేవలం ఒక్క ధోని మాత్రమే. ఇక ధోని ఇండియన్ క్రికెట్లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడంతో అటు ఝార్ఖండ్ టీం కి కూడా అదే రేంజ్ లో గుర్తింపు వచ్చింది. ఇక ఎంతో మంది సెలెక్టర్లు జార్ఖండ్ నుంచి ఆటగాళ్ళను జాతీయ జట్టుకు ఎంపిక చేయడానికి కూడా మొగ్గు చూపారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇదే విషయం గురించి భారత మాజీ క్రికెటర్ సౌరబ్ తివారి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ పై ప్రశంసల వర్షం కురిపించాడు సౌరబ్ తివారి.


 ఇటీవలే ఒక స్పోర్ట్స్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సౌరబ్ తివారి  మాట్లాడుతూ.. మహేంద్ర సింగ్ ధోనిని గాడ్ ఆఫ్ ఝార్ఖండ్ క్రికెట్ అని మేము పిలుచుకుంటూ ఉంటాం. ఆయన భారత జట్టుకు ఆడటం వల్లే ఇక మా రాష్ట్ర జట్టుకు గుర్తింపు వచ్చింది అంటూ సౌరబ్ తివారి చెప్పుకొచ్చాడు. ధోని మా అందరిలో నమ్మకాన్ని కలిగించాడు. మాకు ఎప్పుడు మద్దతుగా నిలిచేవాడు అంటూ గుర్తు చేశాడు. ఇక ధోని రాంచీలో ఉన్నాడు అంటే చాలు మా ప్రాక్టీస్ సెషన్ లోకి వచ్చి.. ఆయన విలువైన సలహాలను ఇచ్చేవాడు అంటూ సౌరబ్ తివారి  గుర్తు చేసుకున్నాడు. కాగా మహేంద్రసింగ్ ధోనీని ఝార్ఖండ్ డైనమైట్ అని పిలుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: