IPL చరిత్రలో ఎలిమినేటర్ ఆడి, ఆ తర్వాత కప్పు కొట్టింది మన సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రమే. ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఇలాంటి పరిస్థితి ఒకటి ఎదురయింది అదే ముంబై ఇండియన్స్. మరి ఇప్పుడు ముంబై ఇండియన్స్ పరిస్థితి ఏంటో చూద్దామా? పంజాబ్ కింగ్స్‌తో ఓటమి తర్వాత, ముంబై ఇండియన్స్ (MI) టాప్-2లో నిలిచే ఛాన్స్‌ను మిస్ చేసుకుంది. అంటే, ఇప్పుడు ఫైనల్‌కు చేరాలంటే పెద్ద యుద్ధమే చేయాలి.

మే 30న జరిగే ఎలిమినేటర్‌తో వీరి ప్రయాణం మొదలవుతుంది. ఛాంపియన్‌షిప్ మ్యాచ్ ఆడాలంటే, MI వరుసగా రెండు నాకౌట్ మ్యాచ్‌లలో గెలిచి తీరాల ఎలిమినేటర్ (మే 30)లో గెలిచిన జట్టు క్వాలిఫయర్ 2కు వెళ్తుంది. క్వాలిఫయర్ 2లో గెలిస్తే ఫైనల్‌కు టికెట్ ఖాయం.

SRH రికార్డును MI సమం చేస్తుందా అనే ప్రశ్న మీకు రావచ్చు. IPL చరిత్రలో, ఎలిమినేటర్ ఆడిన తర్వాత టైటిల్ గెలిచిన ఏకైక జట్టు మన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH). అదీ 2016లో. ఆ ఏడాది SRH ప్రస్థానం మామూలుగా లేదు. క్వాలిఫయర్ 1లో ఓడినా, ఎలిమినేటర్‌లో దుమ్మురేపింది. క్వాలిఫయర్ 2లోనూ గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

ఫైనల్లో RCBని చిత్తు చేసి ట్రోఫీని ముద్దాడింది. ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఈ ఏడాది టైటిల్ గెలవాలంటే, SRH 2016 నాటి ఈ అద్భుతాన్ని రిపీట్ చేయాల్సిందే. ఎలిమినేటర్‌లో MI ప్రత్యర్థి ఎవరనే సస్పెన్స్ వీడేది నేడే. ముంబై ఎలిమినేటర్‌లో ఎవరితో ఆడుతుందనేది ఈరోజు జరిగే RCB vs LSG మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంటుంది.

ఒకవేళ RCB గెలిస్తే MI ఎలిమినేటర్‌లో గుజరాత్ టైటాన్స్ (GT)తో తలపడుతుంది. ఒకవేళ RCB ఓడితే MI రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తోనే ఆడాల్సి ఉంటుంది. ఎలిమినేటర్ ఆడి IPL గెలవడం అనేది చాలా అరుదైన విషయం. ఇప్పటివరకు SRH మాత్రమే ఈ ఘనత సాధించింది. MI ఇప్పుడు వరుసగా మూడు నాకౌట్ మ్యాచ్‌లు (ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2, ఫైనల్) గెలవాలి (క్వాలిఫయర్ 2లో ఓడితే ఇంటికే). వారి ప్రయాణం మే 30న మొదలవుతుంది. మరి 2016లో మన SRH చేసినట్లుగా, MI కూడా చరిత్ర సృష్టిస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: