
మొబైల్ నీళ్లలో పడినట్లు అయితే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మొబైల్ ని ఆన్ చేయకూడదు.. అలాగే ఎలాంటి బటన్స్ ను కూడా ఓత్తకూడదు. తడిచిన మొబైల్ ని గాలిని ఊదే ప్రయత్నం చేయాలి. దీనివల్ల మొబైల్ లోపల భాగంలో నీరు వెళ్లే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా హీట్ డ్రైయర్ ను ఉపయోగించకూడదు. కొద్దిసేపటి తరువాత మొబైల్ ని ఆన్ చేసి సిమ్ము కార్డులను తొలగించాలి.. ఏదైనా క్లాత్ ద్వారా పేపర్ ద్వారా తడిసిన ప్రాంతాలను డ్రై చేసే ప్రయత్నం చేయాలి. తడి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే కాసేపు పొడి బియ్యం లో ఉంచాలి.. ఇలా ఉంచడం వల్ల మొబైల్ లో ఉండే తేమ మొత్తం హావిరవుతుంది.
ఇలా రెండు రోజుల పాటు ఉంచినట్లు అయితే మొబైల్ లో ఉండే తేమ అంతా పోవడం వల్ల మొబైల్ రన్ అవుతుంది. ముఖ్యంగా మొబైల్ ని వినియోగించే వారు తక్కువ ధరకే మొబైల్ కవర్లు పలు ఈ కామర్స్ దిగ్గజ సంవత్సరాల దొరుకుతున్నాయి. వాటిని ఉపయోగించడం వల్ల వర్షం లో తడిచిన నీటిలో పడ్డ మొబైల్ కి ఎలాంటి ఇబ్బంది కలగదు. మొబైల్ నీటిలో పడిన వెంటనే డ్రైయర్ తో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ శుభ్రం చేయకూడదు.