కోర్టు తీర్పుతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక ఎన్నికల కు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుండగా ఫిబ్రవరి 5 న తొలిదశ ఎన్నికలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఎంత వద్దన్నా వినకుండా నిమ్మగడ్డ మొండి తనంతో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు.. కొన్ని నెలలుగా అయన ఈ ఎన్నికలు నిర్వహించడానికి ప్రయత్నించగా ఇటీవలే కోర్టు నిమ్మగడ్డ కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ప్రభుత్వమే కాకుండా ఈ ఎన్నికలకు ఉద్యోగ సంఘాలు కూడా అభ్యంతరాలు చెప్తున్నా నిమ్మగడ్డ వినే పరిస్థితి లో లేరు. ఇప్పటికే ఎన్నిక ప్రక్రియ పనులు శెరవేగంగా జరుగుతుండగా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తర్వాత ఏ స్టెప్ వేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.