నచ్చావులే సినిమా తో టాలీవుడ్ కి పరిచయమైనా తెలుగు హీరోయిన్ మాధవీలత.. ఆ తర్వాత పేరున్న సినిమాలేవీ ఆమెకు రాలేదు.. వచ్చిన ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే కాలక్రమేణా ఆమె కనుమరుగైపోయింది. కానీ ఇటీవలే ఆమె వివాదాస్పద వ్యాఖ్యలతో మళ్ళీ తెరపైకి వచ్చింది. పవన్ కళ్యాణ్ అభిమానినంటూ వెరైటీ పోస్ట్ లు తన సోషల్ మీడియా లో చేస్తూ కొన్ని రోజులు వివాదాల్లో ఉన్న మాధవీ లత ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి చేతులు కాల్చుకున్నారు. బీజేపీ నుంచి గుంటూరు వెస్ట్ అసెంబ్లీ అభ్యర్థినిగా పోటీ చేసి డిపాజిట్ల కోల్పోయింది మాధవీలత.