టాలీవుడ్ లో సరైన అవకాశాలు లేక బాలీవుడ్ కి వెళ్లి అక్కడ మంచి సినిమాలు చేస్తున్న నటి తాప్సి.. మంచు మనోజ్ ఝుమ్మంది నాదం సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తాప్సి ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా ఎందుకో అవి ఆమెకు అంతగా కలిసి రాలేదు. స్టార్ హీరోల సరసన చేసిన కూడా ఆమెకు అస్సలు స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశం రాలేదు. దాంతో అవకాశాలు తగ్గిపోవడంతో ఆమె బాలీవుడ్ కి చెక్కేసింది.. అయితే అక్కడ మాత్రం తన సత్తా ఏంటో నిరూపించుకుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచి వరుస హిట్ లు సాధించారు.