బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయినా జంట అఖిల్, మోనాల్.. వీరిద్దరూ బిగ్ బాస్ కంటే ముందు ఒకరితో ఒకరికి పరిచయం కూడా ఉండకపోవచ్చు. కానీ సీజన్ అయిపోయే సరికి వీరిద్దరూ మోస్ట్ వాంటెడ్ జంట..ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత అతుక్కుని పోయారు.. హౌస్ లో ఉన్నంత సేపు వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు అన్న ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగింది.. మోనాల్ అఖిల్ తో ఉండే విధానం, ఇద్దరు కలిసి మెలిసి తిరిగే విధానం చూస్తే బయటకి వచ్చాక వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారో అన్న అనుమానం వారికి కలిగింది.