దేశంలోనే అతిపెద్ద రియాలిటీ షో అయిన బిగ్ బాస్ పలు సంచలనాలకు వేదిక అవుతుంది. భాష ఏదైనా, ప్లేస్ ఎక్కడైనా బిగ్ బాస్ సంచలనాత్మక టీఆర్ఫీ రేటింగ్ లతో దూసుకుపోతుంది. బిగ్ బాస్ వస్తుందంటే చాలు ఏ ఛానల్ చూసేవారైనా బిగ్ బాస్ వచ్చే ఛానల్‌కి మారిపోవాల్సిందే.. తెలుగులో నాలుగు సీజన్ లు కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ ఐదు సీజన్ కోసం వడివడిగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే పాల్గొన్న ఆర్టిస్ట్ లు ఇప్పుడు మంచి మంచి అవకాశాలు రాబడుతుండడంతో బిగ్ బాస్ లో పాల్గొనాలని అందరు వెయిట్ చేస్తున్నారు..