చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా గుర్తుంది కదా.. అయినా మర్చిపోయే సినిమా నా అది.. కామెడీ కి కొత్త పుంతలు తొక్కించిన సినిమా అది.. బాలీవుడ్ మున్నాభాయి సినిమా కి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా చిరంజీవి కెరీర్ లో మైలురాయి. చిరంజీవి ని ఈ రేంజ్ యాక్టర్ గా చూపించిన సినిమా కూడా ఇదే.. అప్పటివరకు చిరంజీవి కామెడీ సో సో గా చేస్తారని పేరుంది.. ఈ సినిమా తో కామెడీ చేయడంలో కూడా ఆయనే కింగ్ అని తేలిపోయింది.. జయంత్ సి.పరాన్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా లో సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించగా పరేష్ రావల్ ఓ కీలక పాత్ర లో నటించారు..