టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన బిగ్ బాస్ షో నాల్గో సీజన్ గడిచిపోయి నెల రోజులు దాటినా కూడా కంటెస్టెంట్ల హవా మాత్రం ఇంకా తగ్గడం లేదు. ప్రతి ఒక్క కంటస్టెంట్ కూడా తన బ్యాచ్ తో సోషల్ మీడియా లో రచ్చ రచ్చ చేస్తున్నారు. బిగ్ బాస్ లో ఉన్నప్పటినుంచే కంటస్టెంట్ లు ఎవరికి వారుగా బ్యాచ్ లు గా అయిపోయారు.. అది ఇంకా కొనసాగుతూనే ఉంది.. అరియనా, అవినాష్.. మోనాల్, అఖిల్, సోహైల్.. ఇంకా హారిక మరియు నోయెల్, అభిజిత్ లు రోజు కో ఫోటో ను సోషల్ మీడియా లో పెట్టేస్తూ వారియర్ అవుతున్నారు.. మొత్తానికి ఇప్పటికే ప్రతీ ఒక్కరూట్రెండింగ్లోనే ఉంటున్నారు. నిత్యం ఏదో ఒక పోస్ట్ చేయడం.. బిగ్ బాస్ ఇంటి సభ్యులతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు.