ఇద్దరు అమ్మాయిలపై దౌర్జన్యం చేశారనే ఆరోపణలతో కోయిలమ్మ సీరియల్ హీరో సమీర్ అలియాస్ అమర్ శశాంక్ పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయిన విషయం తెలిసిందే.. బోటిక్ నిర్వహిస్తున్న ఇద్దరు అమ్మాయిలు ఆయనపై గత కొన్ని రోజుల క్రితం కేసు నమోదు చేశారు. తాగిన మత్తులో మణికొండలో ఉన్న తమపై సమీర్ దౌర్జన్యం చేశారని ఆ ఇద్దరు అమ్మాయిలు చేసిన ఆరోపణపై పోలీసులు సమీర్ పై కేసు నమోదు చేయగ ఆయనను అరెస్ట్ చేశారు..