యాంకర్ ల పరిస్థితి దారుణంగా ఉన్న సమయంలో, తెలుగు యాంకర్ లు కనుమరుగైపోతున్న టైం లో బుల్లితెరపైకి దూసుకొచ్చిన యాంకర్ అనసూయ.. ఈమె వచ్చాకే యాంకర్ లకు గ్లామర్ తో పాటు డిమాండ్ పెరిగిందని చెప్పొచ్చు.. ఆమెను చూసి యాంకర్ గా సెటిల్ అవ్వాలనుకున్నవారు చాలామంది.. జబర్దస్త్ షో తో అనసూయ ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. గత ఏడేళ్లుగా అనసూయ ఈ షో కి యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.ఆ షో నే కాకుండా మరిన్ని షో లకు కూడా అనసూయ యాంకరింగ్ చేసి మంచి అభిమానాన్ని సంపాదించుకుంది.