బుల్లితెరపై యాంకరింగ్ తో దూసుకుపోతున్న యాంకర్స్ వర్షిణి, రవి.. ప్రదీప్ తర్వాత మేల్ యాంకర్ లలో రవి కి ఉన్న క్రేజ్ ఎవరికీ లేదు. పలుమార్లు వివాదంలో చిక్కుకున్న రవి ఆ తర్వాత వాటినుంచి కోలుకుని ప్రదీప్ కి పోటీగా నిలిచాడు. ఇటు వర్షిణి కూడా అనసూయ, రష్మీ అందాల తాకిడి లో తనకు ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంది. ప్రస్తుతం మా టీవీ లో పెద్ద షో కి యాంకరింగ్ చేస్తున్న వర్షిణి , యాంకర్ రవి చాట్ ఒకటి ఇప్పుడు బయటకి వచ్చింది. గతంలో ఈ ఇద్దరూ కలిసి చేసిన పటాస్ షో బాగానే క్లిక్ అయింది.